Amaravati : అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణ పనులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇటువంటి సమయంలో అమరావతికి కేంద్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. అదనపు భూమి సమీకరించాలన్న అంశంపై బలంగా చర్చ నడుస్తోంది. అయితే అమరావతిని ప్రపంచంలో శక్తివంతమైన నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, క్రికెట్ స్టేడియం వంటి వాటి నిర్మాణానికి నిర్ణయించారు. అందుకే ఇప్పుడు అదనపు భూమి కావాలని భావిస్తున్నారు. ఒక్క అమరావతి కాదు.. విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మెగా సిటీని తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు.
Also Read : అమరావతి 2.0కు ముహూర్తం ఫిక్స్!
* నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్
వాస్తవానికి అమరావతి రాజధాని లో నవ నగరాలు( nine cities ) నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు అనుగుణంగానే 2015 అక్టోబర్లో అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. అప్పట్లోనే నవ నగరాలు నిర్మించి ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దాలని భావించారు. కానీ గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో అమరావతి నిర్వీర్యం అయింది. అప్పటివరకు ఉన్న నిర్మాణాలు వృధాగా మిగిలిపోయాయి. అమరావతి ప్రాంతం అడవిని తలపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే దానికి ఒక రూపం వచ్చింది. పనులు ప్రారంభించనుండడంతో ఒక రూపం రానుంది. అయితే ఇప్పుడు అదనపు భూమి సేకరణ.. మిగతా నగరాలను కలుపుతూ మెగాసిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి.
* భవిష్యత్తు తరాలకు మార్గదర్శి..
అమరావతి అనేది భావితరాల భవిష్యత్తుకు మార్గదర్శి కావాలని చంద్రబాబు( Chandrababu) భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని చూస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్ పోర్టు అవసరం అని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 6000 ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భూములను సేకరించాలా? సమీకరించాల అన్నది నిర్ణయం తీసుకోలేదు. భూ సేకరణ ద్వారా అయితే భారీగా నిధులు ఖర్చయ్య అవకాశం ఉంది. భూ సమీకరణ అయితే రైతులకు ప్రయోజనం కలగని ఉండడంతో వారు ఆహ్వానిస్తున్నారు.
* 1.25 లక్షల సామర్థ్యంతో స్టేడియం..
మరోవైపు క్రీడారంగంలో( sports field) కూడా అమరావతి రాజధానిలో కీలక నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా 1.25 లక్షల మంది కూర్చునే సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలన్నది కూటమి ప్లాన్ గా తెలుస్తోంది. ఒకవైపు నాలుగు నగరాలను కలుపుతూ మెగాసిటీ.. ఆ మెగా సిటీకి తగ్గట్టు వసతులు, నిర్మాణాలు చేపట్టనుంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ ఐదు జిల్లాల్లో 851 ఎకరాలను సిఆర్డిఏ కు కేటాయించింది. ప్రధాని శంకుస్థాపన చేసింది మొదలు మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం గా తెలుస్తోంది. మొత్తం 65 వేల కోట్లతో 92 పనులు చేపడతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
Also Read : అమరావతి పై ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు.. ఆ నిధులకు అడ్డంకి