Amaravati Capital
Amaravati: అమరావతి రాజధాని ( Amravati capital ) పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 33 వేల ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులకు దాదాపు 35 కోట్లు ఖర్చు చేశారు. పాత నిర్మాణాలను యధా స్థానానికి తీసుకొచ్చారు. ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించారు. సుమారు పది నెలల పాటు నిధుల సమీకరణ కూడా జరిగింది. అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరుణంలో ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధపడింది చంద్రబాబు సర్కార్.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా
* ఏకాభిప్రాయంతో అమరావతి..
2014లో టిడిపి( Telugu Desam) అధికారంలోకి వచ్చింది. ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా ఎంపిక చేసింది. దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించింది చంద్రబాబు సర్కార్. 2017 అక్టోబర్ లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయితే అప్పట్లో అమరావతికి భారీ ప్యాకేజీ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అప్పట్లో ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. అమరావతి విషయంలో నిర్లక్ష్యం కొనసాగడం జరిగిపోయింది. అయితే ఐదేళ్లపాటు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసినా అప్పట్లో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు.
* ప్రత్యేక ఫోకస్..
అయితే ఈసారి ఎన్డీఏ( National democratic Alliance ) అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఆ కారణంతోనే అమరావతి రాజధాని నిర్మాణానికి వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. ఇంకా అమరావతికి అవసరమైన నిధులు సమకూర్చుతామని కూడా చెప్పుకొచ్చింది. రైల్వే తో పాటు రహదారులను పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కనున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
* ముచ్చటగా రెండోసారి..
అమరావతి రాజధాని కి శంకుస్థాపన జరగడం ఇది రెండోసారి. గతంలో ఇదే ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) శంకుస్థాపన చేశారు. అప్పట్లో తెలంగాణ సీఎం గా ఉన్న కేసీఆర్ సైతం హాజరయ్యారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత నేత కూడా. తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు సైతం ఆహ్వానం ఉంటుందా? ఉండదా? అన్నది చూడాలి. మరోవైపు రేవంత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఈ కారణంగా పిలుస్తారా? పిలరా? అన్నది చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Amaravati capital construction deadline fixed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com