Ram Charan: మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan). ఈయనకు మగధీర చిత్రం నుండి పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది కానీ, #RRR చిత్రం తో అది తారాస్థాయికి చేరుకుంది. ఇకపోతే రామ్ చరణ్ కి మన ఇండియన్ క్రికెటర్స్ తో మంచి సాన్నిహిత్యం ఎప్పటి నుండో ఉంది. గతంలో ఆయన మాజీ ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) తో కలిసి పెప్సీ యాడ్ చేశాడు. ఈమధ్య కాలం లో కూడా ఆయన ధోని తో కలిసి ఒక ఫోటో దిగాడు. అవి సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాల్లో రామ్ చరణ్ ని, క్రికెట్ లో ధోని ని ఇష్టపడే ఫ్యాన్స్ కి వాళ్ళు అలా కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం పండగే అని చెప్పొచ్చు.
Also Read: ఫ్యాషన్ షోలో రాంప్ వాక్ తో మతిపోయేలా చేస్తున్న శ్వేతా తివారి కూతురు…వీడియో వైరల్..
అయితే విరాట్ కోహ్లీని ఇష్టపడే రామ్ చరణ్ అభిమానులు కూడా, కోహ్లీ(Virat Kohli) తో కలిసి రామ్ చరణ్ ఒక కమర్షియల్ యాడ్ చేయాలనీ, కనీసం ఫోటో అయినా దిగాలని కోరుకున్నారు. అలాంటి అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం IPL సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్లిద్దరు కలిసున్న సెల్ఫీ ఒకటి విడుదల అవ్వడంతో అది మరింత వైరల్ అయ్యింది. అయితే ఇది నిజమైన ఫోటో కాదని, రామ్ చరణ్, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు కలవలేదని, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది క్రియేట్ చేసారని మరికొంతమంది అంటున్నారు. కానీ అది చూసేందుకు నూటికి నూరు పాళ్ళు ఒరిజినల్ ఫోటో లాగానే ఉంది. దీనిపై స్పష్టత లేక సోషల్ మీడియా లో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.
కానీ ఇలాంటి ప్రముఖ క్రికెటర్స్ తో రామ్ చరణ్ సెల్ఫీ లాంటివి తీసుకున్నప్పుడు కచ్చితంగా తన ఇన్ స్టాగ్రామ్, లేకపోతే ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తాడని, అలాంటివేమీ జరగలేదు కాబట్టి, ఇది ఎడిటింగ్ చేయబడిన ఫోటోనే అని అంటున్నారు అభిమానులు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మొదలు పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ ఎలాంటి గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతుంది. శ్రీ రామ నవమి సందర్భంగా ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చివరి షాట్ లో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. గ్లింప్స్ వీడియో తోనే బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అనే ఫీలింగ్ ని అభిమానులకు ఇచ్చిన రామ్ చరణ్, వచ్చే ఏడాది మార్చి 27న సినిమాతో ఎలాంటి అనుభూతిని ఇస్తాడో చూడాలి.
Also Read: అప్పట్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు.. ఇప్పుడు కేవలం 3 నిమిషాల పాటకు కోట్లలో పారితోషకం..