Amaravati Capital: దేశభద్రతలో ఏపీ( Andhra Pradesh) కీలకంగా మారనుంది. శత్రు దుర్భేద్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత ప్రభుత్వం సాధన సంపత్తిని పెంచుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదం, పాకిస్తాన్ ప్రోత్సాహ ఉగ్రవాదం దేశ సరిహద్దుల్లో సవాల్ విసురుతున్న వేళ.. భారతదేశ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీలో ఒక క్షిపణి పరీక్ష కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుంది. మరికొద్ది సేపట్లో ఈ క్షిపణి కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
Also Read: అమరావతిలో ప్రధాని సభకు జగన్.. కీలక నిర్ణయం!
* వర్చువల్ విధానంలో ప్రారంభం..
అమరావతి రాజధాని( Amravati capital) పునర్నిర్మాణ పనులకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది క్షణాల్లో శ్రీకారం చుట్టానున్నారు. ఈ సందర్భంగా లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో భాగంగానే క్షిపణి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతికి కూత వేటు దూరంలో ఈ కేంద్రం నిర్మితం కానుంది. అమరావతికి అతి సమీపంలో కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లల మోదలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక దశలో 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ కేంద్రానికి పర్చువల్ విధానంలో ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. భవిష్యత్తులో భారత్ పరీక్షించనున్న దాదాపు అన్ని క్షిపణుల పరీక్షలన్నీ కూడా గుల్లల మోద కేంద్రం నుంచి జరగనున్నాయి.
* సుదీర్ఘ తీర ప్రాంతం
సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం( seashore area ) ఏపీ సొంతం. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు విన్నపం మేరకు కొత్తగా ఈ క్షిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుల్లలమోద ప్రాంతం కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం అడిగింది తడువు భూమిని కూడా కేటాయించింది కూటమి ప్రభుత్వం. అమరావతి రాజధానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న ఈ కేంద్రం ఏపీ భవిష్యత్తును మార్చనుంది. దేశ భవిష్యత్తుకు ఏపీ ఒక మార్గదర్శకంగా నిలవనుంది. మరికొద్ది సేపట్లో వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధాని చేసే ప్రకటనకు దేశం ఆసక్తిగా తిలకిస్తోంది. అందరి చూపు అమరావతి వైపే ఉంది.
* మోడీ కీలక ప్రకటన..
ఇటీవల కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో.. ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వెలుగులోకి వచ్చిన తరుణంలో యుద్ధం తప్పదని సంకేతాలు వస్తున్నాయి. దేశభద్రతకు పెద్దపీట వేస్తూ ఏపీలో ఏర్పాటు కానున్న ఈ క్షిపణి కేంద్రం ఏర్పాటు, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక సందేశం ఇవ్వనున్నారు. పాకిస్తాన్ తో యుద్ధం పై స్పష్టత నిచ్చే అవకాశం ఉంది. అందుకే దేశం యావత్తు ఇప్పుడు అమరావతి వైపు చూస్తోంది.
Also Read: వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్