QR Code : UPI పేమెంట్ చేయాలన్నా, WhatsApp వెబ్ వాడాలన్నా ఇప్పుడు QR కోడ్ తప్పనిసరి. క్యూఆర్ కోడ్‌లో ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రతిసారి కొత్తగా జనరేట్ అవుతుంది. ప్రతి కోడ్ ఒకదాని కొకటి భిన్నంగా ఉంటుంది. కానీ, మన పనులన్నింటినీ ఈజీ చేసే ఈ క్యూఆర్ కోడ్‌ను అసలు ఎవరు తయారు చేశారో తెలుసా ? ఈ కథనంలో క్యూఆర్ కోడ్ వెనుక ఉన్న కథను తెలుసుకుందాం.
QR కోడ్‌ను ఎవరు, ఎప్పుడు తయారు చేశారు?
నేను మనం యూపీఐ పేమెంట్స్, వాట్సాప్ వెబ్ కోసం QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పనులను ఈజీగా కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఈ QR కోడ్ టెక్నాలజీ ఆవిష్కరణ జరిగి దాదాపు 31 సంవత్సరాలు అవుతుంది. QR కోడ్‌లో QR అంటే క్విక్ రెస్పాన్స్ (Quick Response). ఈ కోడ్‌ను 1994లో జపనీస్ ఇంజనీర్ మాసాహిరో హారా కనుగొన్నారు. ఆ తర్వాత టయోటా మోటార్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ డెన్సో వేవ్ ఈ కోడ్‌ను అభివృద్ధి చేసే పనిని పూర్తి చేసింది.
Also Read : అసలు క్యూఆర్ కోడ్ ఎలా వచ్చింది? దీని హిస్టరీ ఏంటో మీకు తెలుసా?
QR కోడ్ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది?
మాసాహిరో హారాకు QR కోడ్ ఆలోచన గో అనే ఆట ఆడుతున్నప్పుడు వచ్చింది. ఈ ఆట ఆడని వారికి తెలియజేసేది ఏమిటంటే, ఈ ఆటలో నలుపు, తెలుపు రంగులలో కనిపించే 19×19 గ్రిడ్‌లు ఉంటాయి. ఆట ఆడుతున్నప్పుడు, QR కోడ్‌లో చాలా డేటా స్టోర్ చేయవచ్చని ఆయనుకు ఆటోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత, మాసాహిరో హారా తన ఆలోచనను ఆచరణలో పెట్టడానికి డెన్సో వేవ్ బృందంతో కలిసి పనిచేశారు. గ్రిడ్ వ్యవస్థను QR కోడ్‌గా మార్చే పని పూర్తయింది. ప్రారంభంలో దీనిని ఆటోమొబైల్ పరిశ్రమలో విడిభాగాలకు లేబుల్ చేయడానికి ఉపయోగించారు. కానీ ఇప్పుడు QR కోడ్ ప్రతిచోటా ఉపయోగిస్తున్నారు.
Also Read : వాట్సాప్ సరికొత్త ఫీచర్.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీ..