Royal Enfield : ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ యూత్ క్రేజీ బైక్ గా మారిపోయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025లో 86,559 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. ఇది గతేడాది ఇదే నెలలో విక్రయించిన దానికంటే 6 శాతం ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెలలో 10,557 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేయగా, గతేడాది ఇదే నెలలో 6,832 మోటార్‌సైకిళ్లను ఎగుమతి చేసింది. ఎగుమతుల్లో గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 55శాతం వృద్ధి కనిపించింది. ఇది విదేశాల్లో కంపెనీ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025 దేశీయ అమ్మకాలు 76,002 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గతేడాది ఇదే కాలంలో విక్రయించిన 75,038 యూనిట్ల కంటే కేవలం 1 శాతం మాత్రమే ఎక్కువ. అయితే, ఎగుమతి మార్కెట్‌లో మాత్రం ఊహించని వృద్ధి కనిపించింది. ఏప్రిల్ 2025లో 10,557 యూనిట్లు షిప్పింగ్ అయ్యాయి. ఇది ఏప్రిల్ 2024లో ఎగుమతి చేసిన 6,832 యూనిట్ల కంటే 55 శాతం వృద్ధిని సూచిస్తుంది.
Also Read : నో ఝలక్.. ఓన్లీ స్మూత్ రైడింగ్.. కొత్త హంటర్ 350 వచ్చేస్తోంది!
ఏప్రిల్ 2025 నెల పర్ఫామెన్స్ గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో బి గోవిందరాజన్ మాట్లాడుతూ.. “గత ఆర్థిక సంవత్సరంలో మిలియన్ యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకున్న తర్వాత, ఈ ఏడాది కూడా అద్భుతమైన ప్రారంభం లభించింది. ఏప్రిల్‌లో 2025 హంటర్ 350ని విడుదల చేశాం. నేపాల్‌లో క్లాసిక్ 350ని విడుదల చేస్తూ, మా గ్లోబల్ రైడింగ్ కమ్యూనిటీతో మా సంబంధాలను మరింతగా బలపరుచుకుంటూ మా అంతర్జాతీయ ఉనికిని కూడా విస్తరించుకున్నాం.” అని అన్నారు.
2025 హంటర్ 350 విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల భారతీయ మార్కెట్‌లో 2025 హంటర్ 350ని విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌తో కంపెనీ కస్టమర్ల అభిప్రాయాలను తీసుకుని, మునుపటి తరం బైక్‌తో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నించింది. అందుకే ఇందులో కొత్త రియర్ సస్పెన్షన్, కొత్త సీట్ ఫోమ్, LED హెడ్‌ల్యాంప్, మునుపటి కంటే మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, స్లిప్పర్ క్లచ్ ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
ఫీచర్ల విషయానికి వస్తే 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు డ్యూయల్ షాక్‌లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల వీల్స్, ట్రిప్పర్ పాడ్ తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇంజన్, మైలేజ్, ధర కూడా మునుపటిలాగే ఉన్నాయి.
Also Read : భారతీయ బైక్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. నేపాల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా!