Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో స్టార్ హీరోలు మాత్రమే ముందు వరుసలో దూసుకెళ్తున్నారు. ఇక వాళ్ళందరిని డామినేట్ చేస్తూ మన హీరోలు సాధిస్తున్న విజయాలు ఇండియన్ సినిమా హిస్టరీ లో నిలిచిపోతున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకొని వరల్డ్ సినిమా స్థాయిలో కూడా తమ పరిధిని విస్తరింపజేయాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి… ఇక మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ గా ఎదగకుండానే డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి వెళ్ళిపోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలని చూస్తున్న క్రమంలో మహేష్ బాబు (Mahesh Babu) మాత్రం ఫ్యాన్ వరల్డ్ ఇండస్ట్రీకి వెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే సినిమా 2027 వ సంవత్సరంలో రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయబోయే స్పిరిట్(Spirit) సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోంది.
Also Read : మహేష్ బాబు మిస్ చేసుకున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్…
అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది.ఇక మహేష్ బాబు కంటే ముందే వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసి పాన్ వరల్డ్ లో ఆయన కంటే ముందే స్టార్ హీరోలుగా మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
మరి మహేష్ బాబు వచ్చి ఆ రికార్డులను బ్రేక్ చేసి ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటాడని చెప్పడంలో కూడా ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి మహేష్ బాబును ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తాడు.
తద్వారా ఆయనకు వరల్డ్ సినిమా స్థాయిలో కూడా గొప్ప గుర్తింపు లభిస్తుందా? అతనికి అవార్డులు వరించే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరిలో కనిపించే కామన్ ఎలిమెంట్ ఏంటంటే..?