Ambati Rambabu: ఏటా సంక్రాంతి సంబరాలు( Pongal festivals ) వస్తుంటాయి. కానీ గత ఐదేళ్లలో సత్తెనపల్లి ( sattenapalle ) ఎంతో ఫేమస్. అక్కడ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేవారు మాజీ మంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu). సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రత్యేక కార్యక్రమాలతో, డాన్సులతో హోరెత్తించేవారు అంబటి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సంక్రాంతి సంబరాల నిర్వహణ అంబరాన్ని తాకేది. రాష్ట్రం మొత్తం ఫోకస్ సత్తెనపల్లి పై ఉండేది. అయితే ఈ ఏడాది మాత్రం ఎటువంటి సంబరాలు లేకుండా పోయాయి. అనివార్య కారణాల వల్ల సంక్రాంతి సంబరాలు నిర్వహించలేదని అంబటి రాంబాబు ప్రత్యేక వీడియో విడుదల చేసి మరి చెప్పారు.
* గత ఐదేళ్లుగా
సత్తెనపల్లి ( sattenapalle ) నియోజకవర్గ నుంచి 2019లో గెలిచారు అంబటి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై విజయం సాధించారు. దీంతో అంబటిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. దీంతో సత్తెనపల్లిలో ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించేవారు. సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేసేవారు. తామే స్వయంగా డాన్సులు వేసి అదరగొట్టేవారు. సంబరాల రాంబాబు గా ఫేమస్ అయ్యారు. అయితే జనసేనతో వివాదం నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విరుచుకు పడడంతో.. ఆ మధ్యన ఉంగరాల రాంబాబు అంటూ ఓ సినిమాలో ప్రత్యేక క్యారెక్టర్ లో అంబటిని చూపించారు. అప్పట్లో అది వివాదంగా మారింది. అయినా సరే సంక్రాంతి సంబరాలను అంబటి రాంబాబు ఆపలేదు. కానీ ఈసారి మాత్రం సంబరాలు నిలిపివేయడం హాట్ టాపిక్ అవుతోంది.
* ఇంచార్జ్ బాధ్యతల నుంచి తొలగింపు
ఇటీవల సత్తెనపల్లి( sattenapalle ) ఇంచార్జ్ బాధ్యతల నుంచి అంబటి రాంబాబును తప్పించారు జగన్. ఆ నియోజకవర్గంలో కొత్త నేతను తెరపైకి తెచ్చారు. అంబటి రాంబాబును గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నిర్ణయం పై అంబటి రాంబాబులు అసంతృప్తి ఉన్నా.. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. యాక్టివ్ గా కూడా ఉన్నారు. కానీ ఇన్చార్జ్ బాధ్యతలు తీసేశాక.. సంబరాలు నిర్వహిస్తే బాగుండదు అన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలకు దూరమైనట్లు తెలుస్తోంది.
* సోషల్ మీడియాలో వైరల్
అయితే సంక్రాంతి సంబరాలతో( Pongal festivals) హడావిడి చేసిన అంబటి పూర్తిగా సైలెంట్ కావడంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం నడుస్తోంది. కేవలం గెలిస్తేనే సంబరాల? ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించిన వారు ఉన్నారు. అప్పట్లో ఏవేవో మాటలు చెప్పిన అంబటి.. ఇప్పుడు కనిపించకుండా మానేయడం పై మాత్రం రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.