Latvia: మన దగ్గర పురుషులకు తగ్గట్టుగా ఆడవాళ్ళు లేరు. అందువల్లే చాలామందికి పెళ్లిళ్లు కావడం లేదు. ఫలితంగా చాలామంది ఈడొచ్చిన అబ్బాయిలు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.. గతంలో ఇటువంటి పరిస్థితి మనదేశంలో ఉండేది కాదు. కానీ ఆడపిల్లలపై ఆంక్షలు.. భ్రూణ హత్యలు వంటివి పెరిగిపోవడంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అందువల్లే మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు.
మనదేశంలో పరిస్థితి ఇలా ఉంటే లాత్వియా దేశంలో మాత్రం విచిత్రంగా ఉంది. అక్కడ పురుషుల కొరత విపరీతంగా ఉంది. దీంతో మహిళలు పురుషులను అద్దెకు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అనేక నివేదికలు సంచలన విషయాలను వెల్లడిస్తున్నాయి. లాత్వియా దేశంలో పురుషులకంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు.. వంటి పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్ళను అద్దెకి తీసుకుంటున్నారు. ఇంక చాలామంది అమ్మాయిలు తమ జీవిత భాగస్వాముల కోసం దేశాలు దాటి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, గంటల ప్రాతిపదికన మగాళ్లతో పని చేయించుకోవడం బ్రిటన్ లో కూడా ఉంది.
లాత్వియా దేశం లో ఆడవాళ్ళ మీద అంతగా ఆంక్షలు ఉండవు. పైగా అక్కడ వరకట్నం లాంటి వ్యవహారాలు ఉండవు. అందువల్లే అక్కడ ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పైగా ఆడవారు పుడితే అదృష్టం వరించిందని చెబుతుంటారు. అందువల్లే ఇక్కడ ఆడవాళ్లు ఎక్కువగా ఉంటారట. మొదట్లో ఇక్కడి ప్రజలు ఆడవాళ్లకు జన్మ ఇవ్వడానికి ఆసక్తి చూపించేవారు. అందువల్లే ఇక్కడ ఆడవారి సంఖ్య పెరిగిపోయింది. ఆడవారి సంఖ్యకు తగ్గట్టుగా పురుషులు లేకపోవడంతో అక్కడ జనాభాలో లింగ అంతరం పెరిగిపోయింది. దీంతో ఆడవారి అవసరాలు పెరిగిపోయాయి. వారి అవసరాలకు తగ్గట్టుగా పురుషులు లేకపోవడంతో.. ఆ అవసరాలు తీరడానికి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్యవసర సర్వీసులలో పనిచేయడానికి పురుషులు లేకపోవడంతో.. ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా అక్కడి ప్రజలు సిద్ధమయ్యారు. మగవాళ్ళు మాత్రమే పనిచేసే విభాగాలలో గంటకు ఇంత చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఫలితంగా ఈ దేశం అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది.. ఈ వార్త వివిధ మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది ఔత్సాహిక ఇండియన్ నెటిజన్లు ఏకంగా అక్కడికి వెళ్లి పోతామని పేర్కొంటున్నారు.