ABN Venkatakrishna: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గరనుంచి ఏబీఎన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆస్థాన మీడియా గా పేరుపొందినప్పటికీ అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఏకి పారేస్తోంది ఏబీఎన్. ఏబీఎన్ లో కీలక పాత్రికేయుడిగా ఉన్న వెంకటకృష్ణ పలు సందర్భాలలో నిర్వహించిన డిబేట్లలో కూటమి ప్రభుత్వ తప్పులను ఎండగట్టారు. అనుకూలంగా ఉన్న సందర్భంలో పాజిటివ్ గా.. వ్యతిరేకించాల్సిన సందర్భంలో నెగిటివ్ గా వ్యవహరిస్తున్నారు వెంకటకృష్ణ.
మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత ఉండేది. ఇప్పుడు అది ఏపీ రాష్ట్రానికి కూడా తాకింది. ఏపీ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేంద్రంలో కీలకంగా ఉన్నప్పటికీ యూరియాను రైతుల అవసరాలకు తగ్గట్టుగా తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏబీఎన్ ప్రధాన ఆరోపణ. అందువల్లే వెంకటకృష్ణ ఓపెన్ గానే కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పేరుకుపోయాయని.. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదని.. కీలక బిల్లుల చెల్లింపు కూడా ఆగిపోయిందని.. ఒక రకంగా ఆర్థికపరమైన సంక్షోభం ఏపీ రాష్ట్రంలో ఏర్పడిందని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు.
సహజంగా ఏబీఎన్ ఛానల్ లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ కథనాన్ని కూడా వైసిపి అనుకూల మీడియా వదిలిపెట్టదు. ఇప్పుడు వెంకటకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వైసిపి అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తోంది. చూశారా ఏపీలో ఎలా మారిపోయిందో.. కూటమి ప్రభుత్వం అన్ని విభాగాలలో విఫలమైందని.. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయని.. అదే జగన్ కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది అంటూ వైసీపీ మీడియా చిలుక పలుకులు పలుకుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వం హయాంలో బకాయిలు పేరుకుపోవడంతోనే పరిస్థితి ఇలా మారిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఆంధ్రాలో ఆర్థికపరమైన సంక్షోభం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది – ఏబీఎన్!! pic.twitter.com/fkaky0EHdN
— The Samosa Times (@Samotimes2026) September 15, 2025