Homeఆంధ్రప్రదేశ్‌Success Story: రెండు నెలల్లో ఐదు బ్యాంకు ఉద్యోగాలు.. స్వప్నం నెరవేర్చుకున్న కథ!

Success Story: రెండు నెలల్లో ఐదు బ్యాంకు ఉద్యోగాలు.. స్వప్నం నెరవేర్చుకున్న కథ!

Success Story: ఉద్యోగాల కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతున్నారు. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అన్నభావనలో ఉన్నారు. మరోవైపు రోజు రోజుకూ పోటీ పెరుగుతుండగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కానీ కొందరు పోటీతో సబంధం లేకుండా ఒక్క జాబ్‌ అయినా నాదే అన్న లక్ష్యంతో చదువుతుంటారు. తాజాగా ఏపీకి చెందిన యువతి అదే చేసింది. తన కల నెరవేర్చుకుంది. 2 నెలల్లో ఐదు బ్యాంకు జాబులు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. వివాహం […]

Success Story: ఉద్యోగాల కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతున్నారు. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు అన్నభావనలో ఉన్నారు. మరోవైపు రోజు రోజుకూ పోటీ పెరుగుతుండగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. కానీ కొందరు పోటీతో సబంధం లేకుండా ఒక్క జాబ్‌ అయినా నాదే అన్న లక్ష్యంతో చదువుతుంటారు. తాజాగా ఏపీకి చెందిన యువతి అదే చేసింది. తన కల నెరవేర్చుకుంది. 2 నెలల్లో ఐదు బ్యాంకు జాబులు సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

వివాహం తర్వాత పట్టుదలతో..
పెళ్లి చదువుకు, ఉద్యోగాలకు ఆటంకంగా భావిస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోణి విశాఖపట్నంకు చెందిన స్వప్న డిగ్రీ వరకు చదువుకుని, వివాహం తర్వాత శ్రీకాకుళం జిల్లా జొన్నలపాడు అత్తింట్లో ఉంటూ ఉద్యోగాలకు సన్నద్ధమైంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు, ఇంకోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే చదువుపై దృష్టి పెట్టింది. మూడింటిని సమతుల్యం చేసుకుంటూ రెండు నెలల్లో ఐదు ప్రముఖ బ్యాంకుల ఉద్యోగాలు సాధించింది.

క్రమబద్ధమైన ఎంపికలు..
స్వప్న సాధించిన ఉద్యోగాలు ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలతో కూడిన కఠిన పరీక్షలు. ఐబీపీఎస్‌ పీవోస్‌ ధికారుల స్థాయి పోస్టుకు ప్రీలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. వాటిని గెలిచింది. ఆర్‌బీవో పీవో ^గామీణ బ్యాంకుల్లో అధికారి పదవి, లక్షల మంది అభ్యర్థుల మధ్య విజయం విజయం సాధించింది. బీఐ జూనియర్‌ అసోసియేట్‌ – కస్టమర్‌ సపోర్ట్‌ రోల్‌కు మెయిన్స్‌ ఆధారంగా ఎంపిక అయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్లర్క్‌ పోస్టు సాధించింది. ఏపీజీబీ క్లర్క్‌ ఉద్యోగానికీ ఎంపికైంది.

విజయ రహస్యాలు..
స్వప్న విజయం వెనుక ప్రధాన కారణాలు టైం మేనేజ్‌మెంట్‌. రోజుకు 10 నుంచి 12 గంటలు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్‌ సబ్జెక్టులు చదివేది. కుటుంబ బాధ్యతల మధ్య ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు, ప్రీవియస్‌ పేపర్ల పరిశీలన చేసింది.పెళ్లి అడ్డంకిగా పరిగణించకుండా లక్ష్యంపై ఫోకస్‌ పెట్టింది.

ఈ సాఫల్యం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మహిళలకు మోడల్‌గా మారుతోంది. బ్యాంకింగ్‌ రంగంలో మహిళల ఉద్యోగాలు 25% పెరిగాయి, ఇలాంటి కథలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. దీర్ఘకాలంలో ఆమె ఎంపికల్లో ఉన్న చేలికి జీతాలు, కెరీర్‌ గ్రోత్‌ అవకాశాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇస్తాయి. స్వప్న లాంటి వ్యక్తులు యువతకు ‘అసాధ్యం లేదు‘ అనే సందేశాన్ని ఇస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper