OG Overseas: టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం సరిగ్గా మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెద్ద హీరోల సినిమాలు సక్సెస్ అవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తున్న బయ్యర్స్ , ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ జనాల్లో క్రియేట్ చేసిన క్రేజ్, హైప్ అలాంటిది మరీ. రీసెంట్ గా విడుదల చేసిన ‘గన్స్ & రోజెస్’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పాటలు వచ్చాయి కానీ, సినిమా కంటెంట్ ఏమిటి?, స్టోరీ ఏమిటి? అని ఆడియన్స్ కి ఒక ఐడియా ఇచ్చే విధంగా ఒక్క ట్రైలర్ కట్ కూడా రాలేదు. ఓవర్సీస్ లో ట్రైలర్ ని చూసే జనాలు టికెట్స్ ని కొనుగోలు చేస్తారని అందరు అంటుంటారు.
కానీ ఈ సినిమాకు థియేట్రికల్ ట్రైలర్ లేకపోయినప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సినిమా విడుదలకు 9 రోజుల ముందే ఈ చిత్రానికి రెండు మిలియన్ డాలర్లకు పైగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వచ్చింది. ఇది సాధారణమైన విషయం కాదు. అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముందే వచ్చింది అన్నమాట. ఓవర్సీస్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఏ రేంజ్ విద్వంసం ఉంటుందో అభిమానుల ఊహలకే వదిలేస్తున్నాం. నార్త్ అమెరికా లో ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. అక్కడి ఆడియన్స్ సినిమాలను చూసేందుకు ఇష్టపడే AMC థియేటర్స్ చైన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు అవ్వలేదు.
ఈ థియేటర్స్ చైన్ కేవలం సినిమా కంటెంట్ వాళ్లకు డెలివరీ అయిన తర్వాతే బుకింగ్స్ ని ప్రారంబిస్తారట. అందుకే ఈ చైన్ ఇంకా హోల్డ్ లోనే ఉంది. ఈ నెల 18 న సినిమా కంటెంట్ మొత్తం ఓవర్సీస్ కి డెలివరీ అయిపోతుందని అంతా అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. అదే కనుక జరిగితే ఆల్ టైం రికార్డు సాధించిన ఇండియన్ చిత్రం గా సరికొత్త రికార్డు ని నెలకొల్పుతుంది ఈ చిత్రం. కేవలం నార్త్ అమెరికా లోనే కాదు, ఆస్ట్రేలియా లో కూడా ఈ సినిమాకు బంపర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచం లోనే అతి పెద్ద ఐమాక్స్ థియేటర్స్ లో ఒకటైన మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టిన మూడు నిమిషాల్లోనే హౌస్ ఫుల్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక థియేట్రికల్ ట్రైలర్ విడుదల తర్వాత ఏ రేంజ్ విద్వంసం జరుగుతుందో చూడాలి.