Aarogyasri: ఏపీవ్యాప్తంగా ఈరోజు నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ( NTR arogyasree ) సేవలు నిలిచిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయి ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి చలనం లేకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు నిలిచి పోనిండడంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ బకాయిల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఆ సంఘ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు.
Also Read: కంచ గచ్చిబౌలి భూములు.. రేవంత్ రెడ్డికి లేచిందే పరుగు..
* రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆసుపత్రులు..
రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఆసుపత్రులు నెట్వర్క్ జాబితాలో ఉన్నాయి. రేషన్ కార్డు తో పాటు ఆరోగ్యశ్రీ ( aarogyasree )కార్డు ఉన్నవారికి అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుతూ వచ్చాయి. ప్రధానంగా గుండెపోటు వైద్యులకు ఆరోగ్యశ్రీ వరంగా నిలిచింది. ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తూ వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వాటిని చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ ఎప్పటికప్పుడు చెల్లింపులు నిలిచి పోవడంతో దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు.
* పరిధి పెరిగినా..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) ప్రభుత్వ హయాంలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చాలా రుగ్మతలను చేర్చారు. పథకం పరిధిని 25 లక్షల రూపాయల వరకు పెంచారు. అయితే ఎన్నికలకు ముందు ఈ ప్రకటన చేశారు. కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు మాత్రం జాప్యం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికే భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వాటికి సంబంధించి చెల్లింపులు చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అయితే ఇటీవల బకాయిలు ఒకేసారి పేరుకు పోవడంతో నెట్వర్క్ యాజమాన్యాలు పునరాలోచనలో పడ్డాయి. అందుకే ఇప్పుడు సమ్మె బాట పట్టాయి. అయితే ప్రభుత్వం మాత్రం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య కమిటీతో సమావేశం అయ్యేందుకు సిద్ధపడుతోంది.
* వైయస్ షర్మిల విమర్శలు..
మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల( Sharmila) స్పందించారు. ఏపీ ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. గత తొమ్మిది నెలలుగా పూర్తిస్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా.. వైద్య సేవలు ఆపే దాకా చూడడం అంటే.. ఆరోగ్యశ్రీపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది అన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య స్త్రీగా మారిందని ఎద్దేవా చేశారు. పేదోడికి వైద్యం అందరి ద్రాక్షావుతోందని విమర్శించారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని.. వైద్యానికి గ్లోబల్ సిటీ చేస్తామని గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందుగా నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.