SRH Vs GT 2025: ఆ మధ్య విరాట్ కోహ్లీ(Virat Kohli) రంజీ మ్యాచ్ ఆడినప్పుడు.. ఢిల్లీ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒకానొక సందర్భంలో ఢిల్లీ స్టేడియం నిర్వాహకులు గేట్లను మూయాల్సి వచ్చింది. సీట్ల సామర్థ్యానికి మించి అభిమానులు రావడంతో.. కొందరైతే స్టేడియం గోడలు ఎక్కి విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ చేశారు. విరాట్ కోహ్లీ మైదానం లోకి రావడమే ఆలస్యం.. అభిమానులు విరాట్ విరాట్ అంటూ అతడి నామస్మరణ చేశారు. అయితే ఈ మ్యాచ్ ను ఉచితంగా చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు తాకిడి మరింత పెరిగింది. ఒకవేళ టికెట్లు అమ్మినా అభిమానులు ఇదే స్థాయిలో మైదానానికి వచ్చి ఉండేవారని ఢిల్లీ స్టేడియం నిర్వాహకులు పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ కి ఆఫ్లైన్లోనే కాదు… ఆన్లైన్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అతడికి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అతడు ఒక ప్రకటన చేస్తే చాలు కోట్లల్లో ఆదాయం వస్తూ ఉంటుంది. కేవలం క్రికెట్, కమర్షియల్ యాడ్స్ మాత్రమే కాదు.. హోటల్ రంగంలోకి కూడా విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో అతడికి హోటల్స్ ఉన్నాయి.
Also Read: సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!
హైదరాబాద్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నామస్మరణ
ఆదివారం హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. ఏడు వికెట్ల తేడాతో మరో పరాజయాన్ని మూట కట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా నాలుగు మ్యాచ్లలో హైదరాబాద్ ఓడిపోయింది. పాయింట్లు పట్టికలో లాస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. అయితే ఈ మ్యాచ్లో అభిమానులు విరాట్ కోహ్లీ నామస్మరణ చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు తలపడనప్పటికీ.. విరాట్ కోహ్లీ ఆడకపోయినప్పటికీ.. అభిమానులు విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలను వేసుకొని మైదానంలో సందడి చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు ఆడుతున్నంత సేపు.. గుజరాత్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు.. వారంతా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటూ అరవడం విశేషం. ” మాకు విరాట్ అంటే చాలా ఇష్టం. అలాగని హైదరాబాద్ జట్టుపై ప్రేమ లేదని కాదు. కాకపోతే విరాట్ ఆట మమ్మల్ని సమ్మోహితులను చేస్తుంది. ఆదివారం అతడు ఆడకపోయినప్పటికీ.. విరాట్ కోహ్లీ మీద అభిమానంతో ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చాము. విరాట్ కోహ్లీ మీద మాకు ఉన్న ప్రేమను ఈ విధంగా ప్రదర్శించాం. విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీని వేసుకుంటే మాకు తెలియని ఆనందం కలిగింది. గుజరాత్, హైదరాబాద్ జట్లు తలపడుతున్నప్పటికీ.. మాకు ఎందుకనో విరాట్ కోహ్లీ ఆడుతున్నట్టే కనిపించిందని” ఆ అభిమానులు వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ పేరు ఉన్న జెర్సీలను వేసుకొని హైదరాబాద్, గుజరాత్ జట్లు తలపడిన మ్యాచ్ ను చూసినవారిని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పొగుడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు అభిమానులైతే వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మీరు చూపించే ప్రేమ ఈసారి కచ్చితంగా బెంగుళూరు జట్టును ఐపీఎల్ విజేతన చేస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Man it’s a sea of Virat jerseys for Non-RCB match @imVkohli pic.twitter.com/lBj79jfwGZ
— Praneeth VK¹⁸ (@fantasy_d11) April 6, 2025