https://oktelugu.com/

14 సంవత్సరాలుగా అన్నం తినని బాలిక.. ఎలా బ్రతుకుతోందంటే..?

రోజులో ఒక పూట తినకపోతే నీరసం వచ్చి చాలామంది చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఒక బాలిక మాత్రం 14 సంవత్సరాల నుంచి అన్నం తినడం లేదు. పుట్టినప్పటి నుంచి తొలి ఏడాది మినహా 14 ఏళ్లలో ఆ పాప ఇప్పటివరకు అన్నం మెతుకు తినలేదు. కేవలం టీ, మిక్చర్, చిరుతిళ్లతోనే ఆ పాప జీవనం సాగిస్తోంది. పోషకాలు లేని ఆహారం తింటున్నా పాప మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని తెలుస్తోంది. మొదట్లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 6:54 pm
    Follow us on


    రోజులో ఒక పూట తినకపోతే నీరసం వచ్చి చాలామంది చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఒక బాలిక మాత్రం 14 సంవత్సరాల నుంచి అన్నం తినడం లేదు. పుట్టినప్పటి నుంచి తొలి ఏడాది మినహా 14 ఏళ్లలో ఆ పాప ఇప్పటివరకు అన్నం మెతుకు తినలేదు. కేవలం టీ, మిక్చర్, చిరుతిళ్లతోనే ఆ పాప జీవనం సాగిస్తోంది. పోషకాలు లేని ఆహారం తింటున్నా పాప మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని తెలుస్తోంది.

    మొదట్లో పాప ఆహారపు అలవాట్లను చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు పాప పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో భయాందోళనను తగ్గించుకున్నారు. పాప తల్లిదండ్రులు పాపకు ఆహారం అలవాటు చేయాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో రాధాకృష్ణ, అరుణ దంపతులు జీవిస్తున్నారు.

    రాధాకృష్ణ , అరుణలకు ఒక పాప, ఒక బాబు. పాప నాగేంద్ర పుట్టిన తొలి ఏడాది నుంచి అన్నం తినడం మానేసింది. అన్నం కాకుండా చిరుతిళ్లు పెడితేనే తింటూ ఉండటంతో కుటుంబ సభ్యులు సైతం వాటినే ఆహారంగా ఇస్తూ వస్తున్నారు. లంచ్ బాక్స్ లో చాక్లెట్లు, మిక్చర్, ఇతర తినుబండారాలను తీసుకెళుతూ నాగేంద్ర తోటి విద్యార్థులను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నారు.

    పాప అన్నం తీసుకున్నా వెంటనే వాంతికి చేసుకుంటోందని అలా ఎందుకు జరుగుతున్నా తమకు అర్థం కావడం లేదని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే బాలిక అన్నం తినకపోవడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.