Orthorexia disease : రుచి, పచి లేకుంటే ముద్దదిగదు కదా.. గడ్డిని మేసే జంతువులు కూడా అప్పడప్పుడు రుచి, వాసన కోసం ఇతర ఆకులు, కొమ్మలను తింటుంటాయి. కానీ కొందరు మాత్రం ఒక హద్దు గీసుకొని మరీ అందులోనే బతికేస్తారు. శరీర పోషణకు ఎంతో కొంత ఆహారం తీసుకోవాలి ఇది ప్రకృతి నియమం. లేదంటే జీవుడు మనగలడం సాధ్యం కాదు. అయితే అది ఏ విధంగా ఉండాలన్న దానిపై శాస్త్రీయంగా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎంత తీసుకుంటే శరీర పోషణకు పని చేస్తుంది. ఎంత తీసుకంటే మోతాదు పెరిగి ఊబకాయం వస్తుంది. దీని ద్వారా ఏఏ దుష్పరిణామాలు కలుగతాయన్న దానిపై ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో చాలా మంది వైద్యులు, చాలా మంది న్యూట్రీషియన్లు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వారు చెప్పిన దానికి తగ్గట్లుగా తీసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండడమే కాకుండా నిత్య యవ్వనంగా కనిపిస్తారు. అయితే సింపుల్ డైట్ (పరిమితి పాటించి తీసుకునే ఆహారం) పాటించడం కూడా ఒక రోగమేనని ఇటీవల పరిశోధనల్లో తేలింది. అయితే ఇది న్యూట్రియనిస్టులు, వైద్యులు సూచించిన డైట్ మాత్రం కాదు. వారికి వారే ఏర్పాటు చేసుకున్న డైట్.
మీరెప్పుడైనా ‘ఆర్థోరెగ్జియా’ గురించి విన్నారా…? ఇది ఒక గ్రీకు పదం ‘ఆర్థో’ అంటే సరైన, ‘ఒరెగ్జియా’ అంటే సాధారణమైన అని అర్థం. అంటే ఆర్థోరెగ్జియా అంటే కరెక్ట్ డైట్ అని అర్థం కొందరిలో ఆహారం అధికంగా తీసుకోవడం అలవాటుగా మారుతుంది. దీనికి కారణం వారిలోని జన్యు పరమైన విధానం కావచ్చు. బ్రెయిల్ లో ఫుడ్ ను కంట్రోల్ చేసే హార్మోన్ లో లోపం ఉండచ్చు. ఇంకా ఫుడ్ అంటే ఇష్టం కావచ్చు. రంగు రంగుల ఫుడ్ ను చూస్తే కృత్రిమ ఆకలి క్రియేట్ కావచ్చు.. ఇలా చాలా కారణాలు ఉంటాయి. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకొని రోగా పాలవుతుంటారు.
ఇక ఆర్థోరెగ్జియాకు చెందిన వారు మాత్రం సింపుల్ డైట్ తీసుకుంటారు. వీరికి ఫుడ్ అంటే అంత ఇంట్రస్ట్ ఉండదు. ఎంత టేస్ట్ తో ఉన్నా కూడా వీరు లిమిట్ కు మించి తినరు. కేవలం జీవక్రియకు మాత్రమే సరిపోతుంది అంటారు. వీరు ఆకలిని క్షాణాల్లో కంట్రోల్ చేసుకోగలరు. అయితే ఇది వ్యాధి కాదని కొందరు అంటున్నా.. మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా వ్యాధే అంటున్నారు.
అయితే ఆర్థోరెగ్జియాతో ఉన్న వారు ఫుడ్ పట్ల ఒక పొసెసివ్ నెస్ ను కలిగి ఉంటారు. సారోగ్యంగా ఉండాలనుకుంటూ ఫుడ్ తగ్గిస్తారు. కొన్ని ఆహారాలను అసహ్యించుకుంటారు. కొన్నింటిని మాత్రమే తింటూ బక్కచిక్కి పోవాలని కోరుకుంటారు. ఇది ముమ్మాటికి రోగ లక్షణమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.