https://oktelugu.com/

Politics Lookback 2024: చంద్రబాబుకు కలిసొచ్చిన కాలం.. టిడిపి పడి లేచిన కెరటం

ఏదైనా కాలం కలిసి రావాలంటారు. ఇది సత్యం కూడా. ఈ లెక్కన 2024 టిడిపికి కలిసి వచ్చిన కాలం. ఆ పార్టీ కనుమరుగవుతుందని అంతా భావించారు. కానీ పడి లేచిన కెరటంలా ఎగసిపడింది ఆ పార్టీ.

Written By:
  • Dharma
  • , Updated On : December 14, 2024 / 01:29 PM IST

    Politics Lookback 2024

    Follow us on

    Politics Lookback 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పడి లేచిన కెరటం తెలుగుదేశం పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే 2024 ఆ పార్టీకి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఏడాది. తెలుగుదేశం పని అయిపోయిందన్న వారితోనే.. శభాష్ టిడిపి అని చప్పట్లు కొట్టించుకున్న సంవత్సరం ఇది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ పొందని విజయాన్ని ఆ పార్టీ సొంతం చేసుకుంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఏపీలో ఎప్పుడు గెలవని సీట్లలో కూడా ఘనవిజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. 2లక్షల ఓట్లు ఉన్న దగ్గర కూడా 90 వేల ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ గెలిచిన సందర్భంగా ఇది. అయితే దీని వెనుక అపర చాణుక్యుడు చంద్రబాబు ఉన్నాడన్నది బహిరంగ రహస్యం. శత్రువుతో చివరి వరకు పోరాడే తత్వం ఆయనది. అయితే ఎంతలా చేసినా కాలం అనేది కలిసి రావాలి. ఆ కాలం 2024లో చంద్రబాబుకు కలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఘన విజయం తెచ్చి పెట్టింది.

    * కలిసి వచ్చిన చాలా అంశాలు
    ఎప్పుడూ 2019లో జరిగిన వివేకానంద రెడ్డి హత్య అంశం.. 2024లో కలిసి వచ్చిన అంశం గా మారిపోయింది. ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎప్పుడు రాయలసీమలో టిడిపి వెనుకబాటుతో ఉండేది. ఎన్టీఆర్ హయాంలో సైతం మిశ్రమ ఫలితాలే వచ్చేవి. కానీ 2024 ఫలితాల్లో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ రాయలసీమలో. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా.. గతంలో విజయం అన్నది తెలియని 30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది.

    * అలుపెరగని శ్రామికుడిగా..
    2019లో కనివిని ఎరుగని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. పార్టీకి భవిష్యత్తు లేదని ప్రచారం చేశారు. పార్టీని నిర్వీర్యం చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ దానిని తట్టుకొని నిలబడింది తెలుగుదేశం పార్టీ. అయితే 2023 సెప్టెంబర్ వరకు ఒక ఎత్తు.. ఆ తరువాత మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి నడిచింది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఇమేజ్ మరింత పెరిగింది. వైసిపి గ్రాఫ్ మరింత తగ్గింది. అయితే 2024లో ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు తన కదలికలను మార్చారు. తన వ్యూహాలను పదును పెట్టారు. ఏడుపదుల వయసులో అలుపెరగకుండా శ్రమించారు. వందలాది ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. తన స్టైల్ ను మార్చారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ఆయన శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించిన ప్రజలు అద్భుత విజయాన్ని అందించారు. అందుకే తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు 2024 ప్రత్యేకమే.