https://oktelugu.com/

Ind Vs Aus 3rd Test: ఇది ఊహించిందే.. తుడిచిపెట్టుకుపోయిన తొలి సెషన్.. చేతులెత్తేసిన భారత బౌలర్లు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా, ఆస్ట్రేలియా తల పడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సిరీస్ లో రెండు టెస్టులు పూర్తయ్యాయి. పెర్త్ టెస్టులో భారత్ గెలిచింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో అందరి కళ్ళూ బ్రిస్బేన్ టెస్ట్ పై పడ్డాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 14, 2024 / 01:37 PM IST

    Ind Vs Aus 3rd Test(1)

    Follow us on

    Ind Vs Aus 3rd Test: శనివారం భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ నిర్ణయించుకున్నాడు. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే గబ్బా మైదానంలో విస్తారంగా వర్షం కురిసింది. ఆట ప్రారంభమైన మూడు సార్లు వర్షం కురిసింది. దీంతో తొలి సెషన్ నిలిచిపోయింది. వాస్తవానికి కొద్ది రోజులుగా బ్రిస్బేన్ లో వాతావరణం మేఘావృతమైంది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే అక్కడ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ కు అనేకసార్లు అంతరాయం కలిగింది. వర్షం వల్ల మొదటి సెషన్ లో 13.2 ఓవర్లు మాత్రమే ఆటసాధ్యమైంది. ఐతే ఆస్ట్రేలియా కుళ్ళు ఎందుకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 28 రన్స్ చేసింది. వాస్తవానికి ఈ మైదానంపై తేమ ఉండడం, ఎత్తుగా పచ్చిక ఉండడంతో బౌలర్లు వేగవంతమైన పేస్ రాబట్టి వికెట్లు పడగొడతారని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంచనా వేశాడు. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ అతడి నిర్ణయం ఆచరణలో సాధ్యం కాలేదు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

    అనుకున్న సమయానికి మొదలైనా..

    మ్యాచ్ అనుకున్న సమయానికి మొదలైనప్పటికీ.. 5.3 ఓవర్ల తర్వాత వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి భారీ వర్షం కురవడంతో మ్యాచ్ అరగంటసేపు ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ మొదలుపెట్టారు. 8 ఓవర్ల పాటు ఆటసాగిన తర్వాత మళ్లీ వర్షం కురవడం మొదలైంది. దీంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. అయితే ఈసారి కూడా వర్షం విపరీతంగా పడటంతో మ్యాచ్ మళ్లీ మొదలు కాలేదు. అర్ధ గంట సేపు ఎదురుచూసిన అంపైర్లు.. ఇక లాభం లేదనుకొని భోజన విరామానికి సిగ్నల్ ఇచ్చారు. దీంతో తొలి సెషన్ లో 15 ఓవర్ల పాటు ఆట ఆగిపోయింది. ప్రస్తుతం అక్కడ వర్షం తగ్గిపోయినప్పటికీ.. ఆట పునః ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టి అవకాశం ఉంది. ఈ మైదానంలో మురుగునీటిపారుదల వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అందువల్ల త్వరగానే మ్యాచ్ మొదలవుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

    తేలిపోయిన బౌలర్లు

    ఈ మైదానంపై పచ్చని గడ్డి ఉండడంతో రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని భావించాడు. అయితే మైదానం మొదట్లో ప్లాట్ గా దర్శనమిచ్చింది. బంతి కూడా ఊహించినంత స్వింగ్ కాలేదు. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు ఆకట్టుకునే విధంగా బౌలింగ్ చేయలేకపోయారు. స్టంప్ లైన్ కోల్పోయారు. దీంతో ఊహించిన విధంగా వికెట్లు పడగొట్టలేకపోయారు. కొత్త బంతిని అందుకున్న బుమ్రా ఆరు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఇందులో మూడు ఓవర్లు మెయిడ్ ఇన్ గా వేశాడు. అతడు మొత్తంగా 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తొలి రెండు టెస్టుల మాదిరి ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించడంలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. హర్షిత్ స్థానంలో వచ్చిన ఆకాష్ 3.2 ఓవర్లు వేశాడు. ఇందులో రెండు మెయిడ్ ఇన్ లు ఉన్నాయి. అతడు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆకాష్ ప్రత్యేకంగా బౌలింగ్ వేసినట్టు కనిపించలేదు. సిరాజ్ కూడా నాలుగు ఓవర్లలో రెండు మెయిడ్ ఇన్ లు వేశాడు.