Homeటాప్ స్టోరీస్YouTuber Vaishnavi: హరిబాబును అలా చేసిన తర్వాత.. యూట్యూబర్ వైష్ణవి సోదరుడి సంచలన సెల్ఫీ వీడియో.....

YouTuber Vaishnavi: హరిబాబును అలా చేసిన తర్వాత.. యూట్యూబర్ వైష్ణవి సోదరుడి సంచలన సెల్ఫీ వీడియో.. అందులో ఏం కోరాడంటే..

YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి ఈ ఏడాది మార్చి 17న తన భర్త చేతిలో అంతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భర్త జైలుకు వెళ్ళాడు.. ఆమె కన్నుమూయడానికి కారణం హరిబాబు అని పోలీసుల విచారణలో తేలింది. అతడు కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు.. సొంత గ్రామంలో ఉంటే తనను చంపేస్తారని భయపడి ఆయన తన తల్లితో కలిసి నిజామాబాద్ వచ్చాడు. ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ […]

YouTuber Vaishnavi: యూట్యూబర్ వైష్ణవి ఈ ఏడాది మార్చి 17న తన భర్త చేతిలో అంతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భర్త జైలుకు వెళ్ళాడు.. ఆమె కన్నుమూయడానికి కారణం హరిబాబు అని పోలీసుల విచారణలో తేలింది. అతడు కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు.. సొంత గ్రామంలో ఉంటే తనను చంపేస్తారని భయపడి ఆయన తన తల్లితో కలిసి నిజామాబాద్ వచ్చాడు. ఇక్కడ మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు.

అదును చూసి

హరిబాబు కదలికలపై కొద్దిరోజులుగా వైష్ణవి సోదరులు గట్టిగా నిఘా పెట్టారు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎవరితో మాట్లాడుతున్నాడు.. అనే విషయాలను తెలుసుకున్నారు. మొత్తానికి అదును చూసి అంతం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక కారులో వచ్చాడు. పదునైన కత్తిని తన వెంట తెచ్చుకున్నాడు. నిజామాబాద్ లోని ఆర్ఆర్ సెంటర్ ప్రాంతంలో పానీపూరి బండి వద్ద ప్లాస్టిక్ బాటిల్లో హరిబాబు నీళ్లు పట్టుకుంటుండగా.. సంతోష్ ఒక్కసారిగా వేటు వేశాడు.. మెడ.. తల ప్రాంతంలో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో హరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో పడిపోయాడు.

చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వచ్చారు. అక్కడినుంచి అతడిని ఆసుపత్రికి తరలించగా చనిపోయాడు. ఈ ఘటన సంచలనం కలిగించింది. అయితే అతడిని చంపేసిన తర్వాత సంతోష్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చెల్లెలి మరణానికి ఇప్పటికీ శాంతి కలిగిందని వ్యాఖ్యానించాడు. ఇటువంటి పరిస్థితి మరో ఆడపిల్లకు రాకుండా ఉండడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. అంతేకాదు తనకు శిక్ష పడకుండా ప్రజలు కాపాడుకోవాలని సూచించాడు. ఆడపిల్లల మీద దారుణాలకు పాల్పడే వారికి ఇటువంటి శిక్ష పడాలని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.

వైష్ణవి చనిపోయిన తర్వాత ఆమె సోదరులు తీవ్రంగా విలపించారు. ఆమె చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు వారు కుదురుగా లేరు. పైగా హరిబాబును అంతం చేయాలనే ప్రణాళికతోనే ఉన్నారు. అందువల్లే వారు అదును చూసి దాడి చేశారు. కార్తీక్ ను చంపేసి.. తమ చెల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. సంతోష్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు వెల్లడించిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. అయితే చాలామంది వైష్ణవికి అనుకూలంగా మాట్లాడడం.. సంతోష్ చేసిన పనిని సమర్థించడం విశేషం.
యూట్యూబర్ వైష్ణవి ఈ ఏడాది మార్చి 17న తన భర్త చేతిలో అంతమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె భర్త జైలుకు వెళ్ళాడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper