Top 10 Two Wheelers February 2026 India Sales: రోజువారి వినియోగదారులతోపాటు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తమ ప్రయాణాలకు ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. అయితే మార్కెట్లోకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన టూ వీలర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. అయితే వినియోగదారులు తమకు అనుగుణంగా టూ వీలర్స్ ను ఎంచుకుంటున్నారు. ఇలా పలు కంపెనీలకు చెందిన వాహనాల అమ్మకాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి నెలలో టూ వీలర్స్ సేల్స్ విషయానికి వస్తే కొన్ని కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ఆ కంపెనీల వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ Hero నుంచి ఇప్పటికే మార్కెట్లోకి ఆకట్టుకునే మోడల్స్ వచ్చాయి. అయితే ఫిబ్రవరి 2026 లో ఈ కంపెనీకి చెందిన Hero Splendor The On Dispiretz King అనే వెహికల్ ను ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఈనెల మొత్తంలో 3,08,980 యూనిట్ల అమ్మకాలు సేల్స్ అయ్యాయి. అత్యధిక మైలేజ్ తో పాటు అతి తక్కువ ధరలో ఇది ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు.
Honda కంపెనీ నుంచి ఇప్పటికే Shine ఎక్కువగా ఆదరణ పొందుతోంది. అయితే దీని ఇంజన్ పనితీరు బాగా ఉండటంతో చాలామంది యూత్ తో పాటు రోజువారి వినియోగదారులు కొనుగోలు చేశారు ఫిబ్రవరి నెలలో దీని అమ్మకాలు 1,38,438 యూనిట్లుగా ఉన్నాయి. Bajaj కంపెనీకి చెందిన Pulsar బైక్ ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ బైక్ విపరీతంగా అమ్మకాలు చేసుకుంటుంది. అయితే బజాజ్ పల్సర్ పర్ఫామెన్స్ మీట్స్ వాల్యూమ్ అనే బైక్ ను ఫిబ్రవరిలో 1,11,617 మంది కొనుగోలు చేశారు.
Hero కంపెనీకి చెందిన మరో బైక్ HF డీలక్స్ కూడా ఎక్కువగా ఆదరణ పొందుతుంది. ఈ బైక్ ఫిబ్రవరి నెలలో 71,717 యూనిట్ల సేల్స్ జరిగింది. TVS కంపెనీకి చెందిన Appachi బైకు కూడా ఎక్కువగా ఆదరణ పొందుతుంది. స్టూడెంట్స్ తో పాటు యూత్ ఎక్కువగా దీనిని ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ ఫిబ్రవరిలో 45,166 అమ్మకాలు చేసుకుంది. ఇది ఎప్పటికీ స్థిరమైన డిమాండ్ ను కలిగి ఉంటుంది. TVS కంపెనీకి చెందిన మోపెడ్ XL అమ్మకాలు తగ్గలేదని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆదరించే దీనిని ఫిబ్రవరిలో 45,095 మంది సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రీమియం బైక్ లా ఉండే Honda యునికార్న్ బైక్ 2026 ఫిబ్రవరిలో 36,317 యూనిట్ల సేల్స్ జరిగింది. యూత్ ఎక్కువగా దీనిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే టీవీఎస్ రైడర్ 36,134.. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 -34,307.. హోండా షైన్ 32,922 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
