https://oktelugu.com/

Celebrities Died: 2021లో మృతిచెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు..!

Celebrities Died: కరోనా రక్కసి సినిమా ఇండస్ట్రీని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మహమ్మరి విజృంభణతో షూటింగులు, థియేటర్లు నిలిచిపోయి ఇండస్ట్రీ ఆదాయం మొత్తంగా కుదేలై పోయింది. కరోనా ఆంక్షల మధ్య ప్రస్తుతం నటీనటులంతా భయభయంగానే షూటింగులు చేస్తున్నారు. ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోవడంతో సినిమాలకు సరైన కలెక్షన్లు రాక నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. మరోవైపు ఇండస్ట్రీకి చెందిన చిన్న, పెద్ద నటీనటులంతా ఇటీవలీ కాలంలో వరుసగా మృత్యువాతపడటం అందరినీ కలిచివేస్తోంది. 2020లో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 / 11:38 AM IST
    Follow us on

    Celebrities Died: కరోనా రక్కసి సినిమా ఇండస్ట్రీని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మహమ్మరి విజృంభణతో షూటింగులు, థియేటర్లు నిలిచిపోయి ఇండస్ట్రీ ఆదాయం మొత్తంగా కుదేలై పోయింది.

    కరోనా ఆంక్షల మధ్య ప్రస్తుతం నటీనటులంతా భయభయంగానే షూటింగులు చేస్తున్నారు. ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోవడంతో సినిమాలకు సరైన కలెక్షన్లు రాక నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు.

    Celebrities Died

    మరోవైపు ఇండస్ట్రీకి చెందిన చిన్న, పెద్ద నటీనటులంతా ఇటీవలీ కాలంలో వరుసగా మృత్యువాతపడటం అందరినీ కలిచివేస్తోంది. 2020లో సంవత్సరంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వంటి స్టార్లు మృతిచెందడం చిత్రసీమకు తీరని లోటును మిగిల్చింది. ఇక 2021 ఏడాదిలోనూ అదే విషాదం కంటిన్యూ కావడం శోచనీయంగా మారింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఇన్ స్పైర్ అతనే.. కథ అక్కడే మొదలైంది..: రాజమౌళి

    సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఈ ఏడాది సినీ సెలబ్రెటీలు పెద్దసంఖ్యలో మృతిచెందారు. టాలీవుడ్ విషయానికొస్తే సీనియర్ నటీనటులు, డైరెక్టర్లు, కామెడియన్లు, డాన్స్ మాస్టర్, సాహితివేత్త అనే తేడా లేకుండా సెలబ్రేటీలంతా మృత్యుఒడిలోకి వెళ్లారు. ఈ ఏడాది చివరిరోజు సందర్భంగా అలాంటి వారిని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం..!

    వేదం సినిమాతో 70ఏళ్ల వయస్సులో నాగయ్య అనే రైతు నటుడిగా తెలుగువారికి పరిచయమయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’లో కన్పించిన నాగయ్య తన పాత్రకు మంచిపేరు దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో కన్పించాడు. 70ఏళ్ల వయస్సులోనూ నాగయ్య ఎంతో చలాకీగా కన్పించేవాడు. కాగా 2021 మార్చి 27న నాగయ్య మృతిచెందడం శోచనీయం మారింది.

     

    అగ్ర నటీనటులతో కలిసి నటించిన పొట్టి వీరయ్య 2021లోనే మృతిచెందాడు. మరుగుజ్జు పాత్రల్లో కన్పించే పొట్టి వీరయ్య కామెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ 25న పొట్టి వీరయ్య కన్నుమూశాడు.

     

    నటుడు, జర్నలిస్టు అయిన టీఎన్ఆర్ యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తుమ్మల నరసింహ రెడ్డి అలియాస్ టీఎన్ఆర్ సినిమా జర్నలిస్టుగా ఇండస్ట్రీలో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. 2021 మే 10న కరోనా కారణంగా టీఎన్ఆర్ మృతిచెందాడు.

    ప్రముఖ సినీ విమర్శకుడిగా కత్తి మహేష్ జూన్ 26న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అదేవిధంగా ఉదయ్ కిరణ్ తో ‘శ్రీరామ్’ మూవీని తెరకెక్కిన డైరెక్టర్ సాయిబాలాజీ 2021లోనే మృతిచెందాడు. ప్రముఖ పీఆర్వోలు బీఏ రాజు, మహేష్ కోనేరు, సీనియర్ నటి జయంతి, శివశంకర్ మాస్టర్, ప్రముఖ సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి , స్టార్ కామెడీయన్ వివేక్, దర్శకుడు కేవీ ఆనంద్ లాంటి ప్రముఖులు సైతం ఇదే ఏడాది మృత్యువాత పడటం శోచనీయంగా మారింది.

    Also Read:  ఈ శుక్రవారం డిసెంబర్ 31న విడుదలయ్యే 7 సినిమాలు.. వాటి రివ్యూ!