https://oktelugu.com/

Liger First Glimpse: ‘లైగర్’ కథను రివీల్ చేసిన విజయ్..!

Liger First Glimpse: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ‘పెళ్లిచూపులు’ మూవీతో డిసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ వంటి వరుస హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు మాత్రం అభిమానులను నిరాశ పరిచాయి. దీంతో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి విజయ్ కు వచ్చింది. ముఖ్యంగా ‘వరల్డ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 31, 2021 / 12:10 PM IST
    Follow us on

    Liger First Glimpse: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ‘పెళ్లిచూపులు’ మూవీతో డిసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ వంటి వరుస హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు మాత్రం అభిమానులను నిరాశ పరిచాయి. దీంతో తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి విజయ్ కు వచ్చింది.

    Liger First Glimpse

    ముఖ్యంగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.  తొలిరోజు నుంచే ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ కెరీర్లోనే అట్టర్ ప్లాప్ మూవీగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిలిచిపోయింది. ఈక్రమంలో విజయ్ దేవరకొండ ఓ భారీ హిట్టు కొట్టేందుకు డైరెక్టర్ పూరితో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘లైగర్’ మూవీ కొద్దిరోజులుగా తెరకెక్కుతోంది.

    ప్యాన్ ఇండియా లెవల్లో ‘లైగర్’ మూవీని పూరి జగన్మాథ్ తీర్చిదిద్దుతున్నాడు. విజయ్ దేవరకొండ తొలి బాలీవుడ్ మూవీ సైతం ‘లైగర్’ కావడం విశేషం. దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

    Also Read:  2021 టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ.. సామ్ చై విడాకుల నుంచి నేచురల్ స్టార్ నాని వరకు..!

    2021 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి అందరూ వెల్ కమ్ చెబుతున్న సమయంలో ‘లైగర్’ అభిమానుల కోసం ఓ గ్లిమ్స్ ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ ను ప్రధానంగా బాక్సింగ్ రింగ్‌ ఫినాలేకు ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లైగర్‌గా చూపించారు.

    ‘ముంబైకు చెందిన స్లమ్‌డాగ్.. నగరంలో ఛాయ్ అమ్ముకునే ఛాయ్‌వాలా.. ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగుతున్నాడు’ అంటూ హీరో పాత్రకు సంబంధించిన సన్నివేశాన్ని హైలైట్ చేస్తూ చూపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, విజయ్ మేనరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ మూవీ కోసం ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ పని చేస్తున్నాడు.

    ‘వీ ఆర్ ఇండియన్స్’ అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన గొంతును వినిపించాడు విజయ్ విన్పించడం.. చివర్లో ‘ఆగ్ లగా దేంగే’ అంటూ డైలాగ్ విసిరి ప్రత్యర్థులకు రౌడీ బాయ్ వార్నింగ్ వంటివి గ్లిమ్స్ లో హైలెట్ గా నిలిచాయి. పూరి మార్క్ ఎక్కడ మిస్ కాకుండా ఉండటం మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ 2022, ఆగస్టు 25న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.