https://oktelugu.com/

Amaravati: అమరావతి పేరు మీద అప్పు కోసం జగన్ ప్రయత్నాలు?

Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కష్టాలను గట్టెక్కేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీని కోసం అక్కడ మౌలిక వసతుల కల్పనల పేర రుణ సేకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి గాను అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రుణం తీసుకోవడానికి డీపీఆర్ ను సిద్ధం చేస్తోంది. అయితే గతంలో మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా ఆ బిల్లును రద్దు చేసింది. దీంతో కేసు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 31, 2021 / 11:37 AM IST
    Follow us on

    Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో కష్టాలను గట్టెక్కేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. దీని కోసం అక్కడ మౌలిక వసతుల కల్పనల పేర రుణ సేకరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి గాను అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రుణం తీసుకోవడానికి డీపీఆర్ ను సిద్ధం చేస్తోంది. అయితే గతంలో మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకు తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా ఆ బిల్లును రద్దు చేసింది.

    AP CM Jagan

    దీంతో కేసు హైకోర్టులో కొనసాగుతుండగా బిల్లుల ఉపసంహరణపై అఫిడవిట్ సమర్పించింది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో ప్రకటించినా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో రూ. 10 వేల కోట్ల రుణం తీసుకోవాలని భావిస్తోంది. అమరావతిలో ట్రంక్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ తో పాటుగా ఎల్ పీఎస్ లే అవుట్ ల అభివృద్ధికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చట్టసభల్లో సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొంది గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారింది. దీంతో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ద్వారా డీపీఆర్ సమర్పించనుంది.

    Also Read: సీఎం జగన్ మనిషేనా…? మరి ఎందుకు ఇలా!

    అమరావతిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి పదివేల కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని భావించింది. మూడు దశల్లో ఆ రుణం తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. పనులు పూర్తి చేయడానికి 18 నెలల కాల పరిమితిగా పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకునే రుణానికి రెండున్నరేళ్ల మారటోరియం ఉండేలా చూసుకుంది.

    ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ భారీ వ్యూహాన్నే రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రస్తుతం వివాదాస్పదం కావడంతో ప్రజల నుంచి విమర్శలు రాకుండా చూసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు

    Tags