CM YS Jagan: జగన్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోర్టు కేసులే. ఎందుకంటే ఏ రాజకీయ నేతకు లేనన్ని కేసుల గొడవలు జగన్ ఉన్నాయేమో అనిపిస్తుంది. సీఎం అయిన తర్వాత కూడా ఆయనకు కోర్టు కేసుల టెన్షన్ వదలట్లేదు. కాగా 2014లో జగన్ మీద ఓ కేసు నమోదైంది. అప్పట్లో తెలంగాణలోని హుజూర్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా జగన్ రోడ్ షో చేశారనే కేసు ఇప్పటికీ నడుస్తోంది.
మొదట్లో ఈ కేసు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టుకు చేరుకుంది. కాగా ఈ కేసు విచారణకు మార్చి 28న హాజరు కావాలంటూ జగన్ కు కోర్టు సమన్లు పంపించింది. ఇక్కడే జగన్ ఓ మెలిక పెట్టుకున్నారు. తనకు నిర్ణీత టైమ్ లో ఆ సమన్లు చేరలేదని, కాబట్టి మరోసారి సమన్లు పంపాలని జగన్ తరఫున న్యాయవాదులు వినిపించారు.
ఈ క్రమంలో జగన్కు మరోసారి సమన్లు పంపించింది న్యాయస్థానం. ఈ సమన్లు పంపడంపై జగన్ తెలంగాణ కోర్టునుఆశ్రయించారు. అసలు ఈ కేసును కొట్టేయాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఏప్రిల్ 30 దాకా నాంపల్లి కోర్టుకు హాజరు కాకుండా స్టే ఇచ్చేసింది. ఆ తర్వాత హైకోర్టులో దీని మీద విచారణ జరపనుంది.
అసలు ఇందులో జగన్ చేసిందేంటి.. తాను తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నాలు ఏ మాత్రం చేయకుండా.. తీర్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరుక్కున్న జగన్.. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప.. తాను అసలు తప్పు చేయలేదనే వాదనను మాత్రం బలంగా వినిపించలేకపోతున్నారు.
ఆ కేసులతో పోలిస్తే.. ఈ ఉల్లంఘన కేసు పెద్దదేం కాదు. కానీ దీని నుంచి కూడా జగన్ తప్పించుకోవాలని ప్రయత్నించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక ఉన్నతమైన సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి.. న్యాయస్థానాలను గౌరవించాలి గానీ.. ఈ కోర్టులో తీర్పు రాలేదని మరో కోర్టులో పిటిషన్లు వేసుకుంటూ పోవడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు.
Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Ys jagan mohan reddy approaches telangana high court for relief
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com