Bicycle: ఒకప్పుడు మాత్రం సైకిలే ప్రధాన ప్రయాణ సాధనం. ఇంట్లో సైకిల్ ఉన్న వారు కాస్త డబ్బున్నవారిగా పేర్కొనేవారు. కానీ నేటి కాలంలో ఎక్కడా సైకిల్ కనిపించడం లేదు. అందరూ వీటిని వదిలేసి బైక్ లపై నే ప్రయాణిస్తున్నారు. ఒకవేళ సైకిల్ అందుబాటులో ఉన్నా వాటిపై వెళ్లాలంటే ఎవరికీ మనసు రాదు. కానీ ఓ యువకుడు సైకిల్ పై ఏకందా ఖండాన్నే దాటేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 41,400 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎన్నో దేశాలు దాటి ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చేరుకున్న ఈ తెలంగాణ యువకుడి సాహసం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ప్రయాణంలో పలు దేశాలకు చెందిన వారు సన్మానం చేస్తున్నారు. ఇంతకీ అంతదూరం ప్రయాణం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడు? ఆసక్తికరమైన ఈ స్లోరీ వివరాల్లోకి వెళితే..
కరోనా మహమ్మారి ఎందరిని బలిచేసిందో కళ్లారా చూశాం. మరోసారి జీవితంలో ఇటువంటి వ్యాధి రావొద్దని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కోరుకుంటారు. అలాంటి కరోనా బారిన పడిన వారు చనిపోయిన వారిలో తెలంగాణ కు చెందిన వారు కూడా ఉన్నారు. వీరిలో వరంగల్ జిల్లాకు చెందిన గిర్మాజీపేటకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. తన తండ్రి కరోనాతో చనిపోవడంతో రంజిత్ అనే యువకుడు తట్టుకోలేకపోయాడు. అయితే కరోనా చావుకు ఎవరినీ నిందించరాదు. కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి.. ఉంటే తట్టుకునే శక్తి ఉండేది అని రంజీత్ భావించాడు.
దీంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకోసం శారీరక వ్యాయామం చేయాలని అవగాహన కల్పించడానికి రంజిత్ దేశాల పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2021 ఏప్రిల్ 5న వరంగల్ నుంచి సైకిల్ ద్వారా ఆస్ట్రేలియాకు చేరాలని అనుకున్నాడు. దీంతో అప్పుడు మొదలు పెట్టిన రంజిత్ ప్రయాణం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం రంజిత్ ఆస్ట్రేలియాలోని BCT మ్యాచు కు వెళ్లాడు. మొత్తం 13 దేశాల్లో సైకిల్ పైనే ప్రయాణించిన రంజిత్ తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మొత్తానికి ప్రపంచాన్ని చుట్టి రావాలనే తన కోరికను నెరవేర్చుకున్నట్లు తెలిపాడు.
ప్రస్తుతం రోజుల్లో కాలుష్యం కారణంగా చాలా మంది అనారోగ్యాన బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు రంజిత్ చేసిన ఈ సాహసం గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కొన్ని చిన్న అవసరాలకు వాహనాలకు బదులు సైకిల్ వాడడం మంచిదని అంటున్నారు.
పూర్వకాలంలో ఎక్కువమంది సైకిల్ పై వెళ్లేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు కూడా చిన్న చిన్న అవసరాలకు సైకిల్ వాడడం వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అందువల్ల పిల్లలకు చదువుతో పాటు సైక్లింగ్ కూడా నేర్పించాలని అంటున్నారు.