TDP: కడప జిల్లా పేరు చెబితే వైఎస్సార్ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటారు అందరూ. దశాబ్దాల కాలం పాటు ఆ జిల్లాను తన ఆధిపత్యం లో ఉంచుకుంది ఆ కుటుంబం. చివరకు ఎన్టీఆర్ హయాంలో సైతం హవా చాటింది. ఒక్క కడప కాదు.. ఎంటైర్ రాయలసీమనే శాసించింది. అటువంటి కడప ఇప్పుడు ఆ కుటుంబం నుంచి చేజారే ప్రమాదం కనిపిస్తోంది. ఆరు నెలల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అతి కష్టం మీద కడప ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకుంది వైసిపి. దీంతో పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉన్న పట్టును పోగొట్టేందుకు ఇప్పుడు కూటమి ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. అందులో భాగంగా కడప కార్పొరేషన్ పై దృష్టి పెట్టింది కూటమి. ఎట్టి పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
* రంగంలోకి ఎమ్మెల్యే మాధవి
కడప కార్పొరేషన్ లో 15 నుంచి 20 మంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే మాధవి ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని వ్యూహాత్మకంగా చేపట్టారు. వారందరినీ చంద్రబాబు లేదా లోకేష్ సమక్షంలో టిడిపి కండువా కప్పుకునేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ వాళ్లకే సీట్లు ఇవ్వడంతో పాటు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీలోకి వెళితే ఆర్థికంగా లబ్ది పొందవచ్చనే ఆలోచనతో కొందరు కార్పొరేటర్లు అటువైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
* మేయర్ ను గద్దె దించాలని
ఎట్టి పరిస్థితుల్లో కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబును గద్దె దించాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే మాధవి చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 15 నుంచి 20 మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని.. త్వరలో మరి కొంతమంది వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి.