Homeఅంతర్జాతీయంRomantic Crime: సోదరుడిని చంపిన వాడితోనే ప్రేమ.. కారణమిదే

Romantic Crime: సోదరుడిని చంపిన వాడితోనే ప్రేమ.. కారణమిదే

Woman marries man convicted of killing her brotherRomantic Crime: రెండక్షరాల ప్రేమ ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు మనసులో మెదులుతుందో చెప్పదు. ప్రేమ ఎప్పుడు పుట్టినా దాని తీరు ఎవరికి అర్థం కాదు. అందుకే ప్రేమికులు కూడా ఎవరికి అర్థం కారు. ప్రేమ గుడ్డిది అంటారు. దానికి వయసు, కులం, మతం, ప్రాంతం అనే తేడాలుండవు. పండు ముసలిలో కూడా ప్రేమ పుడుతుంది. ఓ గుడ్డివాడిలో సైతం ప్రేమ చిగురిస్తుంది. దివ్యాంగుడైనా, మేధావైనా, హంతకుడైనా మదిలో మెదిలే ప్రేమ కోసం అహర్నిషలు తపిస్తుంటారు. ఎందుకంటే ప్రేమకు ఉన్న గుర్తులు అవి. ప్రేమ చిహ్నాలు కూడా ఉంటాయి.

అమెరికాలో ఓ వింత ప్రేమ కథ చోటుచేసుకుంది. తన అన్నను హత్య చేసిన హంతకుడినే ఆ యువతి ప్రేమించింది. 1989లో అమెరికాలోని క్యూయహోగా కౌంటీలో జాన్ టిడ్జెన్(John Tiedjen) అనే వ్యక్తి బ్రియాన్ మెక్ గారీని హత్య చేసి అరెస్టయ్యాడు. కోర్టు అతడికి 32 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే హత్యకు గురైన బ్రియాన్ మెక్ గారీ సోదరీ క్రిస్టల్ స్రాస్(Crystal Straus) హత్యకు గల కారణాన్ని తెలుసుకునేందుకు జైలులో ఉన్న కిల్లర్ జాన్ టిడ్జెన్ కు లేఖ రాసింది. దీంతో అతడు కూడా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా మారింది.

ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న హంతకుడితో ఆ యువతి ప్రేమాయణం సాగించింది. కొన్ని రోజులు వారి మధ్య ప్రేమ కొనసాగింది. కొద్ది రోజులు గడిచిపోయాయి. క్రిస్టల్ కుటుంబ సభ్యులతో కూడా చెప్పింది. జాన్ కూడా తన మనసులోని మాట చెప్పాడు. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరి ప్రేమ పెరిగి పెద్దలను ఎదిరించే వరకు వెళ్లింది. పెద్దలు వారించినా వారు ఎదురుతిరిగి వివాహం చేసుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు.

సోదరుడినే హత్య చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుని క్రిస్టల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తన అన్నను చంపినందుకు అతడు తగిన శిక్ష అనుభవించాడు. ఇప్పుడు అతడు ఏ పాపం ఎరుగని వ్యక్తి అని నమ్మింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరిగింది. దీంతో అది పెళ్లికి దారి తీసింది. చివరకు పెళ్లి చేసుకునే వరకు వచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకుని మరీ ఈ మేరకు వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular