Bell Bottom Collections: బాలీవుడ్ ఫ్యామిలీ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) అంటే హిందీ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన హీరో. అలాంటి హీరో సినిమా వస్తోంది అంటే కలెక్షన్స్(Collections) ఎలా రావాలి ? కానీ, థియేటర్స్ దగ్గర ఆ హడావుడి లేదు. స్టార్ డమ్ ఉన్నా.. ఏవరేజ్ హీరో కలెక్షన్స్ కూడా రాలేదు. నూతన దర్శకుడు రంజిత్ తివారి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా చేసిన బెల్‌బాటమ్ (Bell Bottom) సినిమా గురించే ఈ తంతంగం అంతా.
అక్షయ్ కుమార్ సీక్రెట్ రా ఏజెంట్ గా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. కానీ అక్షయ్ కష్టం వృధా అయిపోయింది. దీనికి తోడు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఇంకా థియేటర్స్ తెరుచుకోలేదు. కాబట్టి, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే కలెక్షన్స్ ఏమి లేవు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో ‘బెల్ బాటమ్’ సినిమాను దాదాపు 800 థియేటర్లలో విడుదల చేశారు.
అయితే, ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా ? 2 కోట్ల 70 లక్షలు. అవును, ఇది నిజమే !. అసలు అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ హీరోకి వచ్చే కలెక్షన్సేనా ఇవి ? మరీ… 2.70 కోట్లు ఏమిటి ? అసలు ఎందుకు కలెక్షన్స్ రాలేదు ? అయితే, ఇక్కడ రీజన్ మాత్రం ఒక్కటే కనిపిస్తుంది.. హిందీ థియేటరికల్ మార్కెట్ చాలా దారుణ స్థితిలో ఉంది అనేది.
కాబట్టి, థియేటర్ బిజినెస్ ను ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయలేం అంటూ ట్రేడ్ వర్గాలు వివరణ ఇస్తున్నా. ఈ కలెక్షన్స్ మాత్రం అక్షయ్ కుమార్ కి ఘోరమైన అవమానమే. పైగా ఈ చిత్రం ఓపెనింగ్స్ చూసి మొత్తం బాలీవుడ్ సినీ పరిశ్రమే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయింది. దీనిబట్టి కరోనా మహమ్మారి నుండి బాలీవుడ్ మార్కెట్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని తేలిపోయింది.
నిజానికి గత రెండేళ్లుగా హిందీ చిత్రసీమలో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్ లోకి అడుగు పెట్టలేదు. అయితే, దేశంలో కరోనా రెండో వేవ్ తగ్గింది అని, “బెల్ బాటమ్” సినిమాని విడుదల చేశారు. అయితే, కరోనా వేవ్ తగ్గినా.. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు అని మరోసారి రుజువు అయింది.