India Vs China: భారత్‌లోని తూర్పు లద్దాక్‌లో భారత్, చైనా సరిహద్దు వెంట 2020లో ఇరు దేశాలు సైన్యాన్ని మోహరించాయి. గాల్వాన్ ఘటన తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో రెండ దేశాలు పెద్ద ఎత్తున బలగాలను తరలించాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగూతనే వచ్చాయి. చైనా ఉత్పత్తులపై నిషేధం, దిగుమతి సుంఖాల పెంపుతదితర అంశాలతోపాటు దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. మధ్యలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరిపినా.. చైనా తన కుటిల బుద్ధి ప్రదర్శించింది. సరిహద్దులు మారుస్తూ మ్యాప్‌లు విడుదల చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య సఖ్యత పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో వారం క్రితం భారత్ – చైనా మధ్య కీలక ఒప్పందం జరిగింది. కీలక ప్రాంతాల నుంచి సైనికులను ఉప సంహరించుకుని మౌలిక సదుపాయాలు కల్పించడం, 2020 నాటి పరిస్థితిని పునరుద్ధచించడం వంటి ఒప్పందం జరిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బలగాల ఉప సంహరణ ప్రక్రియను ఇరు దేశాలు మొదలు పెట్టాయి. మంగళవారం కీలక ప్రాంతాల నుంచి సైనికుల ఉప సంహరణ పూర్తయినట్లు ఆర్మీ ప్రకటించింది. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్తావారాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకున్నారని పేర్కొంది.
పెట్రోలింగ్ పునరుద్ధరణ..
ఇదిలా ఉంటే తూర్పు లద్దాక్ వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితిని కొనసాగించనున్నారు. 2020లో గస్తీ నిర్వహించి పోలీసులు స్వేచ్ఛగా పెట్రోలింగ్ పాయింట్లకు వెళ్లొచ్చేవారు. ఈ ‘క్రమంలో తాజాగా నాటి పరిస్థితిని పునరుద్ధరించనున్నారు.
గాల్వన్ ఘటనతో ఉద్రిక్తత..
2020 జూన్ 15న తూర్పు లద్దాక్‌లోని గాల్వన్ లోయలో భారత్–చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడుల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబుతోపాటు 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా నష్టపోయింది. ఈ ఘటర్షణల తర్వాత ఇరు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరించాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.