https://oktelugu.com/

Hezbollah: హెజ్‌బొల్లాకు కొత్త చీఫ్‌.. నెల రోజుల తర్వాత అధికారిక ప్రకటన.. ఇజ్రాయెల్ ఏం చేస్తుందో?

తమ ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ హెజ్‌బొల్లాకు కొత్త చీఫ్‌ను నియమించారు. ఇజ్రాయెల్‌ దాడిలో నస్రల్లా మరణించిన నెల తర్వాత కొత్త చీఫ్‌ను ఎంపిక చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2024 / 10:26 AM IST

    Hezbollah

    Follow us on

    Hezbollah: పశ్చిమాసియాలో ఏడాదికాలంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ దానిని క్రమంగా విస్తరించుకుటూ పోతోంది. తమ దేశ సరిహద్దులపై దాడులు చేసి ఇజ్రాయెల్‌ పౌరులను కిడ్నాప్‌ చేసింది హమాస్‌. దీంతో ఇజ్రాయెల్‌ సైనిక చర్య మొదలు పెట్టింది. 2023, అక్టోబర్‌ 7న ప్రారంభించిన యుద్ధం ఏడాది దాటినా కొనసాగుతోంది. మొదట హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడిపించుకోవడమే లక్ష్యంగా దాడులు మొదలు పెట్టింది. కానీ, తర్వాత హమాస్‌ను తుదముట్టించాలని ఐడీఎఫ్‌(ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌) టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న పలువురిని విడిపించుకుంది. ఇప్పటికీ కొంత మంది బందీగా ఉన్నారు. మరోవైపు హమాస్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్‌ దాడులతో హమాస్‌ చీఫ్‌తోపాటు తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ క్రమంలో హమాస్‌ చీఫ్‌ హత్య తర్వాత హోజ్‌బొల్లా రంగలంలోకి దిగింది. హమాస్‌ చీఫ్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఈమేరకు దాడులు కూడా చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ హమాస్‌ తర్వాత హెజ్‌బొల్లాను కూడా టార్గెట్‌ చేసింది.

    పేజర్లు, వాకీ టాకీలు పేల్చి..
    ఐడీఎఫ్‌ హెబ్‌బొల్లా బలా బలాలు తెలుసుకునేందకు సీక్రెట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా వినియోగిస్తున్న పేజర్లు, వాకీ టాకీల్లో పులుడు పదార్థాలు పెట్టి పేల్చింది. దీంతో హెజ్‌బొల్లా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఈ క్రమంలో హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లాను కూడా ఇజ్రాయెల్‌ చంపేసింది. అతని తర్వాత హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నియామకానికి నెల రోజులు సమయం తీసుకుంది. తాజాగా తదుపరి చీఫ్‌గా నయీమ్‌ ఖాస్సేమ్‌ను అధికారికంగా పకటించింది. ఆయన హెజబొల్లా డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. నస్రల్లా మరణం తర్వాత మిలిటెంట్‌ గ్రూపు యాక్టింగ్‌ లీడర్‌గా పనిచేశారు. దీంతో నస్రల్లా స్థానంలో నయీమ్‌ ఖాస్సేమ్‌ను నియమించారు.

    ఎవరీ నయీమ్‌..
    నయీమ్‌ ఖాస్సేమ్‌ దక్షిణ లెబనాన్‌లోని క్చర్‌ఫిలా పట్టణంలో జన్మించాడు. కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. దానికన్నా ముందు లెబనీస్‌ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రాన్ని అభ్యసించారు. 1982లో ఇజ్రాయెల్‌ లెబనాన్‌పై దాడిచేసి దక్షిణ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత ఇరాన్‌ మద్దతులో హెజ్‌బొల్లా ఏర్పడింది. ఇందులో నయీమ్‌ ఖాస్సేమ్‌ చేరారు. 1991 నుంచి ఆయన హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రెటరీగా పనిచేశారు. ఖాస్సీమ్‌కు మంచి వ్యూహకర్తగా పేరుంది. కాల్పుల విరమణకు ప్రయత్నించాడు. సంస్థాగత ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించడంలో దిట్ట.