Diwali in Thailand: థాయిలాండ్ లో దీపావళి ఎలా జరుపు కుంటారు.. అక్కడి చరిత్ర సాంప్రదాయం ఏంటంటే?

వెలుగుల పండుగ దీపావళి రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. భారత్‌తోపాటు ప్రపంచంలో చాలా దేశాల్లో దీపావళిని జరుపుకుంటారు.

Written By: Raj Shekar, Updated On : October 30, 2024 10:19 am

Diwali in Thailand

Follow us on

Diwali in Thailand: దీపావళి.. భారత దేశంలో అందరూ జరుపుకునే పండుగల్లో ఒకటి. ఇక్కడ చిన్న పెద్ద, కులం, మతం తేడా లేకుండా అందరూ పండుగలో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా వేడుకలు జరుపుకుంటారు. కొన్న దేశాలు భారత్‌ లాగానే దీపావళికి సెలవులు ఇస్తున్నాయి. అమెరికాలోని కొన్ని రాస్ట్రాలతోపాటు సింగపూర్, నేపాల్, బాలి, శ్రీలంక తదితర దేశాలు దీపావళికి సెలవులు ఇస్తున్నాయి. ఇక దీపావళి వేడుకలు థాయ్‌లాండ్‌లో భిన్నంగా జరుగుతాయి. ఇప్పటికే థాయ్‌లాండ్‌ మిరిమిట్లు గొలిపేకాంతులతో ప్రకాశిస్తోంది. నింగిలో, నీటిలో లాంతర్ల వెలుగులు, దీపాలతో థాయ్‌లాండ్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏటా నవంబర్‌లో థాయ్‌ ప్రజలు లాయ్‌ క్రాంథోంగ్, యి పెంగ్‌ పేరుతో దీపావళి జరుపుకుంటారు. అరటి ఆకులతో చేసిన దియాలు(దీపాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ దీపాలు తామరపువ్వు ఆకారంలో నదిపై తేలియాడుతుఊ కనువిందు చేస్తాయి. దీపాలపై ఒక నాణెం, ధూపం, కొవ్వత్తులను ఉంచుతారు. దీపావళి రోజున మిఠాయిలు పంచిపెడతారు. పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

లాయ్‌ క్రాథోంగ్‌
లాయ్‌ క్రాథోంగ్‌.. దీనినేఫ్లోటింగ్‌ బాస్కెట్‌ ఫెస్టివల్‌ అని కూడా పిలుస్తారు. లియో అంటే ఫ్లోట్‌ అని, క్రాథాంగ్‌ అనేది పూలతో అలంకరించిన బుట్ట అని అర్థం. థాయ్‌లాండ్‌ లైట్స్‌ ఫెస్టివల్‌గా పిలువబడే లాయ్‌ క్రాథాంగ్‌ ఫెస్టివల్‌ థాయ్‌ చంద్ర క్యాలెండర్‌లోని 12వ నెల పౌర్ణమి రాత్రి జరుగుతుంది. కొవ్వొత్తులు పువ్వులతో అలంకరించిన తామర పువ్వు ఆకారంలో ఉన్న బుట్టలను నదిలో వదులుతారు. దీని ద్వారా నీటి దేవతకు కృతజ్ఞతలు తెలపుతూ పండుగ జరుపుకుంటారు. ఇది వర్షాకాలం ముగింపును గుర్త చేస్తుంది. శీతాకాలానికి స్వాగతం పలుకుతుంది. ఈ వేడుకలో అద్భుతమైన ప్రదర్శనలు, నదులు, కాలువలు, సరస్సులలో తేలియాడే బుట్టలు ఆకట్టుకుంటాయి. లాయ్‌ క్రాథాంగ్‌ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

యి పెంగ్‌..
ఉత్తర థాయిలాండ్‌లో యి పెంగ్‌ వేడుక జరుపుకుంటారు. చియాంగ్‌ మాయిలో ఈ లాంతరు వేడుకను నిర్వహిస్తారు. స్కై లాంతర్‌ ఫెస్టివల్‌ యి పెంగ్‌. రాత్రి వేళ ఆకాశంలో వేల సంఖ్యలో కొవ్వొత్తుల లాంతర్లు ఎగురవేస్తారు. చియాంగ్‌ మాయిలో మాత్రమే ఈ పండుగలను జరుపుకుంటారు. దురదృష్టాన్ని గాలిలోకి వదిలి., అదృష్టాన్ని స్వాగతించడానికి ప్రతీకగా స్పెషల్‌ ప్రోగ్రాంలత సందడిగా ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది.