Homeఆంధ్రప్రదేశ్‌New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!

New Districts In AP: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!

New Districts In AP: ఏపీలో( Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్ల మార్పు వంటి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఎక్కడికి అక్కడే ప్రజలు వినతి పత్రాలు అందిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు డివిజన్ల మార్పుపై వినతులు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ.. సోషల్ మీడియాలో కొత్తగా ఆరు జిల్లాల ఏర్పాటు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని అంటూ ఓ జాబితా మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఎప్పటినుంచో ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి హామీ ఉంది. అందుకే అలా ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?

* మంత్రులతో సబ్ కమిటీ..
కొత్త జిల్లాల( new districts ) ఏర్పాటుతో పాటు సరిహద్దుల మార్పు, మండలాలు, డివిజన్లు మార్పులు చేర్పులపై మంత్రుల సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈనెల 13న సచివాలయంలో మొదటి సమావేశం జరగనుంది. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

* సోషల్ మీడియాలో జాబితా..
అయితే ఏపీలో కొత్తగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో( social media) ప్రచారం చేస్తున్నారు. ఓ లిస్ట్ కూడా వైరల్ అవుతోంది. కొత్తగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లి, ఆదోని జిల్లాలు ఏర్పాటు చేసి అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32 కు చేరుకోనుంది. అయితే కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాలలో.. ఈ నియోజకవర్గాలు అంటూ ప్రచారం సాగుతోంది.
1. కొత్తగా ఏర్పాటు చేయబోయే పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు ఉండబోతున్నాయట.
2. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం జిల్లాలు ఉండబోతున్నాయట.
3. మన్యం పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గం ఉండనున్నాయట.
4. విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలు ఉండనున్నాయట.
5. 5. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలి, విశాఖ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు గాజువాక, పెందుర్తి ఉంటాయట.
6. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు ఉండనున్నాయి.
7. అనకాపల్లి జిల్లా పరిధిలో అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట, తుని..
8. కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం..
9. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్,కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం..
10. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అమలాపురం, ముమ్మిడివరం,పి. గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట..
11. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం..
12. ఏలూరు జిల్లా పరిధిలో ఏలూరు, దెందులూరు, ఉంగటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం..
13. కృష్ణాజిల్లా పరిధిలో కైకలూరు, గుడివాడ,పెడన,, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు..
14. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం
15. అమరావతి జిల్లా పరిధిలో పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
16. గుంటూరు జిల్లా పరిధిలో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు
17. బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె,పర్చూరు
18. పల్నాడు జిల్లా పరిధిలో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19. మార్కాపురం జిల్లా పరిధిలో మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
20. ప్రకాశం జిల్లా ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు
21. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి
22. గూడూరు జిల్లా పరిధిలో గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట
23. తిరుపతి జిల్లా పరిధిలో తిరుపతి, శ్రీ కాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి
24. చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం
25. మదనపల్లి జిల్లా పరిధిలో మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి
26. శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలో హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర
27. అనంతపురం జిల్లా పరిధిలో అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, తాడిపర్తి
28. ఆదోని జిల్లాకు సంబంధించి ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం
29. కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు
30. వైయస్సార్ కడప జిల్లా పరిధిలో కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల
31. వైయస్సార్ కడప జిల్లాకు సంబంధించి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు
32. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాలు ఉండనున్నాయి. అయితే దీనిని ప్రభుత్వం ధ్రువీకరించలేదు. కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular