Kim Jong Un luxury train: ఉత్తరకొరియా అధ్యక్షుడు Kim Jong Un గురించి ప్రపంచ దేశంలో విద్యావంతులైన వారందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇతని గురించి నిత్యం ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అభద్రత కలిగిన ఈ అధ్యక్షుడు ఎప్పటికీ తన చుట్టూ ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అతను తినే ఆహారం నుంచి చేసే కార్యక్రమాలు అన్ని గోప్యంగా ఉంటాయి. దేశ రక్షణ కోసం అనేక క్షిపణులు ప్రయోగాలు చేసి విజయవంతం అవుతున్న ఈయన ప్రయాణం గురించి ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే కిమ్ జంగ్ వన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదు. అయితే ఆయన ఇటీవల వివిధ దేశాల్లో పర్యటనలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఆయన దేశాలు ఎలా తిరుగుతాడు?
మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఉంటారు. దాదాపు ప్రపంచంలోని చాలా దేశాల్లో మోడీ పర్యటన చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానం ఉంటుంది. మిగతా దేశంలోని అధ్యక్షులు సైతం ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసుకొని పర్యటనలు చేస్తుంటారు. కానీ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం చాలా తక్కువ దేశాల్లో పర్యటించారు. 2018లో కిమ్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత 2019లో వియత్నాం దేశంలో మరోసారి సమావేశానికి వెళ్ళాడు. ఇటీవల రష్యా తో పాటు చైనాలో పర్యటన చేశాడు. అయితే ఆయన ఈ పర్యటనలు చేయడానికి ఎలాంటి వాహనం వాడుతారు తెలుసా?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దేశాన్ని విడిచి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రైలులోనే ప్రయాణం చేస్తాడు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇదే నిజం. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు విమానం ఎక్కలేదు. సాధారణంగా కిం తన శత్రు దేశాలను భయపెట్టడానికి కొన్ని ప్రకటనలు చేస్తాడు. అదేంటంటే విమానాలను పేల్చేస్తాం.. గాలిలోనే కలిపేస్తాం.. అంటూ ఉంటాడు. కానీ అతడు విమానంలో ప్రయాణం చేస్తే అభద్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తాడు. అందుకే ఎప్పటికీ విమానంలో ప్రయాణం చేయొద్దని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఈ విషయాన్ని అతడికి హితబోధన చేశాడు. ఎప్పటికైనా ట్రైన్ లోనే వెళ్లాలని చెప్పాడు. తండ్రి మాటను బాగా విన్న కీమ్ ఇప్పటికీ రైలులోనే ఏ దేశానికైనా వెళ్తాడు.
అయితే కిమ్ వెళ్లే ఈ రైలు ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దీని ఖరీదు 1000 కోట్లు. ఈ రైలును అనేక భద్రతా గార్డులు కాపాడుతాయి. ఈ రైలు ఎప్పుడు ప్రయాణం చేసేది.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది.. అనేది శాటిలైట్ నుంచి కూడా గుర్తించకుండా ఏర్పాటు చేశారు. దీనిని యూరప్ నుంచి దిగుమతి చేసిన లగ్జరీ సామాగ్రితో ఏర్పాటు చేశారు. ఇందులోనే కింగ్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది విద్యుత్ తో కాకుండా జనరేటర్ తో మాత్రమే నడుస్తుంది.