Robert F Kennedy Jr: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. దీంతో ఆయన తన క్యాబినెట్ మంత్రులతోపాటు, వైట్‌హౌస్ కార్యవర్గాన్ని ఎన్నిక చేస్తున్నారు. ఈమేరకు విధేయులకు మంత్రి పదవులు, సమర్థులకు వైట్‌హౌస్ పదవుల్లో నియమిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్‌ను నియమించారు. వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకించిన ఆయనను ఆరోగ్య మంత్రిగా నియమించడంపై అమెరికాలో పెద్ద చర్చ జరగుతోంది. ఈ క్రమంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కలిసి బర్గర్ తింటున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రంప్ తాను తినే ఫుడ్ విషంతో సమానమని గతంలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ట్రంప్‌తోనే కలిసి బర్గర్ తినడం ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ జూనియర్ పోస్టు..
మెక్ డొనాల్డ్ ఔట్‌లెట్‌లో ట్రంప్‌తోపాటు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ బర్గర్ తింటున్న ఫొటోను ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ ఎక్స్‌టో పోస్టు చేశాడు. ఇందులో ఎలాన్ మస్క్, యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అయితే ఈ ఫొటోలు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ఉండడం చూసి అమెరికన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రాబర్ట్ ఎఫ్ కెన్నడీ. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తినేదంతా విషమే అని పేర్కొన్నారు. ప్రచారంలో ట్రంప్ తినే డైట్ చెత్తగా ఉంటుందని అది అనారోగ్యానికి దారితీస్తుందని విమర్శించారు. ప్రాసెస్ చేసిన ఆహారం స్టోర్లలో ఉండకూడదని వాదించారు. తాజాగా ఆయనే బర్గర్ తినడం అది కూడా ట్రంప్‌తో కలిసి తినం విమర్శలకు దారితీసింది.
రాజకీయ వారసుడిగా..
రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ అమెరికాలో ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడు. లాయర్‌గా అందరికీ సుపరిచితుడు. మాజీ అటార్నీ జనరల రాబట్ ఎఫ్. కెన్నడీ కుమారుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీకి బంధువు. గతంలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ కరోనా వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా..
ఇదిలా ఉంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికల్లో జో బైడెన్‌కు పోటీగా నిలిచారు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే మధ్యలోనే డ్రాప్ అయ్యాడు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతు తెలిపారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రచారంలో పాల్గొన్నాడు. అందకే ట్రంప్ మంత్రిగా నియమించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Why did trump nominate robert f kennedy jr who strongly opposed vaccinations to be the secretary of health
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com