https://oktelugu.com/

Canada: కెనడాలో ఏం జరుగుతోంది.. ఎందుకు మృతదేహాలను అలా వదిలేస్తున్నారు?

కెనడా అనేది అభివృద్ధి చెందిన దేశం. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందినవారు నివసిస్తుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంత్యక్రియల ఖర్చు అక్కడ విపరీతంగా పెరిగింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 21, 2024 / 10:42 AM IST

    Why dead bodies are going unclaimed in Canada

    Follow us on

    Canada: అయినవాళ్లు కన్నుమూస్తే.. ఎంతో బాధపడతాం. వారిని గుర్తు చేసుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఘనంగా అంతిమయాత్ర నిర్వహిస్తాం. సంప్రదాయాన్ని బట్టి మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. చావు విషయంలోనూ విభిన్నమైన సంస్కృతిని, ఆచారాలను పాటించడం మనదేశంలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే కెనడా దేశంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఏమైతున్నదంటే..

    కెనడా అనేది అభివృద్ధి చెందిన దేశం. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందినవారు నివసిస్తుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అంత్యక్రియల ఖర్చు అక్కడ విపరీతంగా పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఖర్చు ఉంది.. గ్రేటర్ టొరంటో నగరంలో అంత్యక్రియల ఖర్చు దాదాపుగా 34 వేల డాలర్లకు చేరుకుంది. ఇప్పుడున్న డాలర్ ధర ప్రకారం మనదేశంలో అక్షరాల 27 లక్షలు. వీటికి అదనంగా వ్యాన్, ఇంకా ఇతర ఖర్చులు కలిపి మొత్తం 30 లక్షల దాకా అవుతున్నది. ఈ ఖర్చును భరించలేక చాలామంది తమ అయిన వారి మృతదేహాలను బయట వదిలి వేస్తున్నారు. కెనడాలోని ఆంటార్యో ప్రావిన్స్ లో 2013లో 242 అనాధ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 2023లో అనాధ మృతదేహాల సంఖ్య 1,183 కు పెరిగింది. మృతుల ఉన్న ఆధారాలతో వారి కుటుంబ సభ్యులను గుర్తించినప్పటికీ చాలామంది శవాలను తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదు. అంత్యక్రియల ఖర్చు భారీగా పెరగడంతో గత ఏడాది దేశవ్యాప్తంగా 24% మృతదేహాలను తీసుకెళ్ళేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు స్మశానవాటికల్లో మృతదేహాల ఖనానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్నదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    గతంలో అంత్యక్రియల ఖర్చు ఈ విధంగా ఉండేది కాదు. 2013 నుంచి ఆ ఖర్చు అంతకంతకు పెరుగుతోంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ.. అంత్యక్రియల ఖర్చును తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేయడం లేదు.. పైగా చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. దీంతో స్మశాన వాటికలో ఉండేవారు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. రెట్టింపు ఫీజును తెరపైకి తెచ్చి.. మృతుల కుటుంబ సభ్యులను నిలువు దోపిడీ చేస్తున్నారు.. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై కెనడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.