https://oktelugu.com/

Kajal Aggarwal: వాటికి సర్జరీ చేయించుకున్న కాజల్… అందం కోసం చందమామ సాహసం?

కాజల్ అగర్వాల్ చందమామలా ఉంటుంది. ఆమె గ్లామర్ కి పేరు పెట్టడానికి లేదు. అయితే వివాహం అనంతరం ఆమెకు ఓ సమస్య వచ్చిందట. కాజల్ పెదాలు నల్లగా తయారయ్యాయట. దాంతో ఆమె సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 10:35 AM IST

    Kajal Aggarwal

    Follow us on

    Kajal Aggarwal: హీరోయిన్ కి కావాల్సిన మొదటి క్వాలిటీ చక్కని రూపం. దర్శక నిర్మాతల కంట్లో పడాలన్నా, ప్రేక్షకులు మెచ్చాలన్నా ఒడ్డు పొడుగు ఉండాలి. సహజంగా వచ్చిన అందాలకు కొందరు ఆర్టిఫిషియల్ మెరుగులు దిద్దుతూ ఉంటారు. శ్రీదేవితో పాటు పలువురు హీరోయిన్స్ సర్జరీ చేయించుకున్నారనే వాదన ఉంది. తాజాగా కాజల్ అగర్వాల్ సర్జరీ చేయించుకున్నారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి ఏమిటో చూద్దాం..

    కాజల్ అగర్వాల్ చందమామలా ఉంటుంది. ఆమె గ్లామర్ కి పేరు పెట్టడానికి లేదు. అయితే వివాహం అనంతరం ఆమెకు ఓ సమస్య వచ్చిందట. కాజల్ పెదాలు నల్లగా తయారయ్యాయట. దాంతో ఆమె సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. గులాబీ రంగుతో రొమాంటిక్ గా ఉండేలా తన రెండు పెదాలను సర్జరీతో మార్చేసిందఅనే టాక్ మొదలైంది. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

    సత్యభామ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కాజల్ పెదాలు చూస్తే ఈ డౌట్ రాకమానదు. ఆమె లుక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. పెదాలకు సర్జరీ చేయించడం వలనే కాజల్ ముఖంలో మార్పు కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కాజల్ సర్జరీ చేయించుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అధికారిక సమాచారం కూడా లేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్.

    ఇక సత్యభామ మూవీ మే 31న విడుదల చేస్తున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజల్ ఐఏఎస్ అధికారిణి పాత్ర చేస్తుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఆమె సత్తా చాటనుంది. నవీన్ చంద్ర మరొక కీలక రోల్ చేస్తున్నాడు. సత్యభామ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. మరోవైపు కాజల్ పెళ్లి తర్వాత కూడా సత్తా చాటుతుంది. 2020లో మిత్రుడు గౌతమ్ కిచ్లును కాజల్ పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి సంతానం.