Sukumar Vijay Devarakonda: కొంతమంది దర్శకులు మూస ధోరణిలో సినిమాలు చేస్తూ ఓకే ఫార్ములాని ఫాలో అవుతూ రొటీన్ సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇక అందులో సుకుమార్ ఒకరు. ఈయన చేసిన ఆర్య సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త ఎలిమెంట్ అయితే ఉంటుంది. అది లేకపోతే సుకుమార్ సినిమానే చేయడు.
ఇక ఇదిలా ఉంటే 2020 వ సంవత్సరంలో సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందంటూ ఒక బిగ్ అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది. మరి ఆ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే ఆ సినిమా మీద ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. ఇక కొందరైతే ఆ సినిమా ఆగిపోయింది అని చెప్తుంటే మరికొందరు మాత్రం ఈ సినిమా తొందర్లోనే స్టార్ట్ అవ్వబోతుందనే కథనాలను కూడా వెలువరిస్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ లాంటి టైర్ టు హీరోతో సినిమా చేస్తున్నాడు అంటే నిజానికి విజయ్ అదృష్టమనే చెప్పాలి.అయితే ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే వార్తలైతే ఏమి తెలియడం లేదు.
కానీ మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఈ రెండు సంవత్సరాలలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు సుకుమార్ సన్నిహితుల నుంచి గాని, విజయ్ స్నేహితుల నుంచి గాని వార్తలైతే వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి విజయ్ దేవరకొండ సుకుమార్ వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఈ ప్రాజెక్టు మీద స్పందిస్తే తప్ప దీని మీద సరైన క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు…చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో…