Trump Nobel Peace prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేసినందుకు ఇది జరిగింది. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బడ్డీ కార్టర్ ట్రంప్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారట. దీని కోసం కార్టర్ నోబెల్ శాంతి బహుమతి కమిటీకి ఒక లేఖ రాశారు. అయితే, ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. సంవత్సరం ప్రారంభంలో, అమెరికా ఎంపీ డారెల్ ఇస్సా కూడా ట్రంప్‌ను నోబెల్‌కు నామినేట్ చేశారు. కొంతకాలం క్రితం, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్రంప్‌కు అవార్డును సిఫార్సు చేస్తూ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఇదంతా పక్కన పెడితే అసలు ట్రంప్‌ను నోబెల్ బహుమతికి ఎవరు నామినేట్ చేయవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నోబెల్ శాంతి బహుమతికి ఎవరు నామినేట్ చేయవచ్చు?
నోబెల్ శాంతి బహుమతికి ఎవరూ ఎవరినీ నామినేట్ చేయలేరు. దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలి. నోబెల్ కమిటీ అధికారం పొందిన వ్యక్తులు మాత్రమే దీనికి నామినేట్ చేయగలరు. దీనికి నామినేట్‌ను అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తి, నోబెల్ శాంతి బహుమతి మాజీ విజేతలు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు (రాజకీయాలు, చట్టం, చరిత్ర, సామాజిక శాస్త్రాల రంగంలో), నోబెల్ కమిటీ ప్రస్తుత, మాజీ సభ్యులు, శాంతి, మానవ హక్కుల కోసం పనిచేసే కొన్ని ప్రత్యేక సంస్థలు, సంస్థల అధిపతులు చేయవచ్చు. వీరికి మినహా ఇతరులు నామినేట్ చేయలేరు.
నమోదు ప్రక్రియ
ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి చివరి తేదీ జనవరి 31. నోబెల్ కమిటీ నామినేషన్లను సమీక్షిస్తుంది. విజేతను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ఈ అవార్డు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న ఇస్తారు. 2026 నోబెల్ బహుమతికి రిజిస్ట్రేషన్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. కానీ చివరి తేదీని ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో, 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి 338 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయి. అయితే ఏ దేశాలు నోబెల్‌కు నామినేట్ అవలేదో ఇంకా సమాచారం లేదు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.