Mohan Yadav convoy diesel issue: ముఖ్యమంత్రి కాన్వాయ్ లో వెళ్లే వాహనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తారు. బ్రేక్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్స్ లేటర్ వరకు ప్రతిదాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే బయటికి పంపిస్తారు. ఇక నమ్మకమైన బంకు దగ్గర పెట్రోల్ కొట్టిస్తారు. ఒకవేళ డీజిల్ అవసరమనుకుంటే అదే పోస్తారు. ఆ తర్వాత కాన్వాయ్ రన్ చేస్తారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో దాదాపు 20 వరకు వాహనాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటి సంఖ్య పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో కంపల్సరిగా అంబులెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఆపత్కాలం సంభవిస్తే వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని ఆ పని చేస్తారు. ఇక ఈ వాహనాలలో ఇంధనాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటారు. ఒకవేళ నిండుకుందని భావిస్తే వెంటనే ఫిల్ చేస్తారు. అయితే ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటాయి.. ఇందులో నిర్లక్ష్యానికి.. అలసత్వానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు.
Also Read: Madhya Pradesh : అక్కడ ఆడది అంగట్లో ఆటబొమ్మే.. ఆ ఊరిలో అద్దెకు భార్యలు లభించును
అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ముఖ్యమంత్రి కాన్వాయిలో దాదాపు 19 వరకు వాహనాలు ఉన్నాయి. వాహనాలు ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో ఉన్న వాహనాలను మొత్తం రోడ్డు పక్కకు పెట్టి.. ఆ తర్వాత వేరే వాహనాలను రప్పించి అందులో ముఖ్యమంత్రిని పంపించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని నుంచి ఆయన ఓ అధికారిక పర్యటన నిమిత్తం రాట్లం అనే ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ లో 19కి పైగా వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలు మొత్తం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఆ వాహనాలను రోడ్డు పక్కన పెట్టి.. వేరే వాహనాలలో ముఖ్యమంత్రిని రాట్లం ప్రాంతానికి పంపించారు. అయితే ఆ వాహనాలలో ఉపయోగించిన డీజిల్ లో నీరు కలవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు అంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. ఆ వాహనాలలో డీజిల్ పోసిన బంక్ ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. దీనికి సంబంధించి విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ విచారణలో ఏం తేలుతుందనేది చూడాల్సి ఉంది.. డీజిల్ లో నీరు కలపడం వల్ల ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆగిపోవడం.. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఇక ఇదే నేపథ్యంలో అక్కడి ప్రతిపక్ష పార్టీ విమర్శలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని వాహనాలలో డీజిల్ లో నీరు కలిసింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని.. ఇప్పటికైనా అధికార పార్టీ ఇలాంటి ఘటనలను నిరోధించాలని సూచించింది.
In Madhya Pradesh, 19 Innova cars in CM Mohan Yadav’s convoy were filled with water instead of diesel and broke down one by one!
If this is the state of the CM’s car under, imagine the struggle of common people just to keep going. pic.twitter.com/GATZECMpgN
— Soji Jacob (@sojijacob_Inc) June 27, 2025