Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. కమలా హారిస్ అధ్యక్షురాలవుతుందని సర్వేలు చెప్పినా.. ప్రజలు మాత్రం ట్రంప్ వెంటే నిలిచారు. దీంతో కొంత విరామం తర్వాత ఒక అభ్యర్థి అధ్యక్ష స్థానంపై తిరిగి కూర్చోవడం 131 ఏళ్ల తర్వాత ఇదే. ఎన్నికలకు ముందు కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చివరి వరకూ పోరాడారు. 2016 నాటి ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి పాపులర్ ఓటు కూడా ట్రంప్‌కే దక్కింది. ఆయన దాదాపు 51 శాతానికిపైగా ఓట్లు సాధించారు. హారిస్ 47 శాతం ఓట్లతో వెనుకబడ్డారు.
స్వింగ్ కింగ్ ట్రంపే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఏడు స్వింగ్ స్టేట్స్ ఈసారి ట్రంప్ వెంటే నిలిచాయి. గంప గుత్తాగా ఏడు రాస్ట్రాల్లోనూ ట్రంప్ స్పష్టమైన మెజారిటీ సాధించారు. ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, వేతనాలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో తురుగులేని ప్రభావం చూపాయి.
జార్జియాలోనూ మద్దతు..
ఇక అరబ్, ముస్లింలు అధికంగా ఉన్న జార్జియాలో ఈసారి మొదటి నుంచి కమలా హారిస్ వెనుకంజలో ఉన్నారు. గతంలో ఇక్కడ బైడెన్ హవా నడిచింది. గాజా యుద్ధం నేపథ్యంలో డెమోక్రాట్ల వైఖరిపై ముస్లింలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు కమలా హారిస్ చివరి ప్రచారంలో యుద్ధానికి ముగింపు పలుకుతామని ప్రకటించారు. కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు ట్రంప్ తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో యుద్ధం ముగిస్తానని ప్రకటించారు. దీంతో అమెరికన్లు ట్రంప్‌వైపే మొగ్గు చూపారు.
వలస వాదనకు బలమైన మద్దతు..
ఈ ఎన్నికల్లో అమెరికన్లు వలస వాదనకు బలంగా మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని ఓట్ కాస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా వెల్లడించింది.వాస్తవానికి ఉత్తర అమెరికాలో అక్రమ వలసలు సమస్యగా మారాయి. ఈ విషయాన్ని ట్రంప్ బలంగా వాడుకున్నారు. తాను అధికారంలోకి వస్తే 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను అమలు చేస్తానని ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్, జర్మనీ, ఇటలీ వాసులను కట్టడి చేయడానికి దీనినివాడేశారు. మెజారిటీ అమెరికన్లు ప్రస్తుతం ఇదే కోరుకుంటున్నారు.
యుద్ధ వ్యతిరేకి..
డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానంలో యుద్ధాలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో ఓటర్లను ఆకర్షించిన అంశం. ఇప్పటికే ఉక్రెయిన్, గాజా యుద్ధాల్లో ఆ దేశం పాత్ర ఎక్కువగానే ఉంది. కీవ్‌ను కాపాడేందుకు అమెరికా భారీగా సొమ్ము ఖర్చు చేస్తోంది. ఇది అమెరికన్లకు నచ్చలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. రష్యా యుద్ధం చేసేది కాదని భావించారు. ఇక చైనా విషయంలోనూ బైడెన్ బలహీనంగా కనిపించారు. దీంతో ట్రంప్ గెలవాలని అమెరికన్లు కోరుకున్నారు.
ఆర్థిక వ్యవస్థ కూడా
ట్రంప్ విజయానికి దోహదపడిన అంశాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ కూడా ఒకటి. 2020లో బైడెన్ అధికారం చేపట్టాక తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ద్రవ్యోల్బణానికి దారితీశాయి. ధరలు పెరిగాయి. దీంతో అమెరికన్లు ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ట్రంప్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు.
ట్రంప్ వైపే గ్రామీణ ఓటర్లు..
ఇదిలా ఉంటే.. ట్రంప్‌కు అమెరికాలోని గ్రామీణ ఓటర్లు కూడా మద్దతు తెలిపారు. సర్వేలు చెప్పినా. అయోవా వంటి రాష్ట్రాల్లో ఆయనే విజయం సాధించారు. జార్జియా కెంటకీ, నార్త్ కరోలినాలోనూ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం కనబర్చారు.
అందరూ ట్రంప్ వైపే..
మొత్తంగా ఈ అధ్యక్ష ఎన్నికల్లో అన్నివర్గాల అమెరికన్లు ట్రంప్ గెలుపే కోరుకున్నారు. లోకల్ అంశం బాగా పనిచేసింది. ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, యుద్ధాలు అమెరికన్లలో డెమొక్రటిక్ పార్టీపై వ్యతిరేకత పెంచాయి. దీంతో ఈసారి అన్నివర్గాల ఓటర్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వైపే మొగ్గు చూపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: What is the reason for donald trumps victory what attracted voters in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com