India: కెనడాలో 2023లో కెనడాలో ఉంటున్న నిజ్జర్ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు భారత అధికారులే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే గతేడాది ఆరోపించారు. ఈ రోపణలను ఖండించిన భారత్.. సాక్షాలు ఇవ్వాలని సూచించింది. దీంతో ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా ప్రధాని ట్రూడో తాజాగా భారత్‌పై మరోమారు ఆరోపించారు. నిజ్జర్ హత్య వెనుక భారత హైకమిషన్ అధికారులు ఉన్నారని ఆరోపించారు. వారిని విచారణ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై మండిపడిన భారత్ వెంటనే భారత విదేశాంగ కార్యదర్శులను వెంటనే వెనక్కు పిలిపించింది. అంతటితో ఆగకుండా భారత్‌లోని కెనడా విదేశాంగ శాఖ సిబ్బందిని బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడా విదేశాగ శాఖ మంత్రి తాజాగా ఈసారి భారత హోం శాఖ మంత్రి అమిత్‌షాను టార్టెగ్ చేశారు. కెనడా పార్లమెంట్ విచారణ కమిటీ ఎదుట నిజ్జర్ హత్యపై వివరణ ఇస్తూ.. ఈ హత్య వెనుక బారత హోం మంత్రి అమిత్‌షా ఉన్నట్లు ఆరోపించారు. ఆయన భారత వ్యతిరేకులను మట్టుబెట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు కెనడాలోని సిక్కు వేర్పాటు వాది అయిన నిజ్జర్‌ను విదేశాంగ శాఖ సిబ్బంది ప్రమేయంతో హత్య చేశారని ఆరోపించారు.
కెనడాకు ఎప్పటి నుంచో చెబుతున్న భారత్..
ఇదిలా ఉంటే.. కెనడాలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై మన అధికారులు ఎప్పటికప్పుడు కెనడాకు సమాచారం ఇస్తున్నారు. వారిని ప్రోత్సహించొద్దని సూచిస్తున్నారు. కానీ, కెనడాలో సిక్కులు 7 శాతం ఉన్నారు. వారంతా అక్కడ ఓటర్లు. దీంతో వారిని ఇబ్బంది పెడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ట్రూడో.. భారత వ్యతిరేక చర్యలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. దీంతో దీనిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిజ్జర్, కెనడా ఓటర్లలో 6 శాతం ఉన్న సిక్కులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిజ్జర్ హత్యపై భారత్‌ను టార్గెట్ చేశారు. కానీ, కెనడాలో ఉన్న భారతీయులంతా సిక్కు వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ట్రూడో గుర్తిచండం లేదు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా భారత్‌పై ఇష్టానుసారం, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
కెనడా ఆరోపణల వెనుక పశ్చిమ దేశాలు..
ఇక కెనడా తాజాగా భారత హోం మంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసింది. భారత్‌తో వాపార, వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయని, తమ దేశానికి కూడా నష్టం కలుగుతుందని తెలిసి కూడా కెనడా భారత్‌ను టార్గెట్ చేయడం వెనుక ట్రూడో ప్రయోజనాలతోపాటు పశ్చిమ దేశాల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది. దీనిని పశ్చిమ దేశాలు ఓర్వడం లేదు. మరోవైపు ఎవరి ఆధిపత్యాన్ని భారత్ అంగీకరించడం లేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇది చాలా దేశాలకు నచ్చడం లేదు. మరోవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో భారత్ రష్యాకు మద్దతు ఇచ్చింది. యుద్ధాన్ని వ్యతిరేకించాలని, రష్యాతో లాబాదేవీలు నిలిపివేయాలని అమెరికాతోపాటు చాలా దేశాలు భారత్‌కు సూచించాయి. కానీ భారత్ తన ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చింది. యుద్ధం సరికాదని రష్యాకు చెబుతూనే.. స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. కష్టకాలంలో రష్యా నుంచి పెట్రో ఉత్పత్తులు కొనుగోలు చేసి రష్యాకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఇది కూడా చాలా దేశాలకు నచ్చలేదు. దీంతో భారత్‌ను నేరుగా తప్పపట్టే ధైర్యం చేయలేక, ఆంక్షలు విధించే సాహసం చేయలేక.. ఇలా కెనడాను అడ్డు పెట్టుకుని భారత్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయి.
కెనడాకు అమెరికా మద్దతు..
ఇదిలా ఉంటే.. భారత పరిణామాల గురించి.. కెనడా ఎప్పకిప్పుడు అమెరికాకు సమాచారం ఇస్తుంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. నిజ్జర్ హత్య సమాచారాన్ని తానే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు అందించినట్లు అంగీకరించారు. దీంతో వాషింగ్టన్ పోస్టు కూడా భారత్ హోం మంత్రి అమిత్‌షాపై పెద్ద కథనం రాసింది. నిజ్జర్ హత్య వెనుక అమితషా ఆదేశాలు ఉన్నట్లు ఆరోపించింది. అమెరికా విదేశాంగ అధికారి కూడా కెనడా చర్యలను సమర్థించారు. దీంతో కెనడాకు అమెరికా మద్దతు విషయం బయటపడింది.
భారత్ ఎలా స్పందిస్తుందో..
ఇక అమిత్‌షాను కెనడా, అమెరికా టార్గెట్ చేయడం వెనుక భారత్ ఇంకా స్పందించలేదు. ఉగ్రవాది హత్య విషయానే సీరియస్‌గా పరిగణించి భారత్, అమిత్‌షా పైచేసిన ఆరోపణలు లైట్‌గా తీసుకోదు. కానీ స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Western countries targeting india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com