Canada: ఖలిస్తాని ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యను అడ్డం పెట్టుకుని ఇండాయాను టార్గట్ చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. గతేడాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో ఆరోపించారు. స్పందించిన ఇండియా ట్రూడో వ్యాఖ్యలను ఖండించింది. ఆధారాలు ఇవ్వాలని సూచించింది. ఏడాది గడిచినా ఆధారాలు ఇవ్వకుండా తాజాగా మరోమారు.. భారత్‌పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. దీంతో భారత్ కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ కార్యదర్శులను వెనక్కి పిలిపించింది. అంతటితో ఆగకుండా.. భారత్‌లోని కెనడా రాయబారులను కూడా బహిష్కరించింది. అప్పటి నుంచి భారత్, కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితతి మారింది. ఈ క్రమంలో ఇటీవలే కెనడాలోని హిందూ ఆలయంపై దుండగులు దాడిచేశారు. ఈ దాడిని ప్రధాని ట్రూడోతోపాటు, భారత్ కూడా ఖండించింది.
తాజాగా సింగర్స్ ఇళ్ల వద్ద..
ఆలయంపై దాడి ఘటన మరువక ముందే.. టొరంటోలో ఇండియన్ సింగర్స్ నివాసం ఉంటున్న ప్రాంతంలో కాల్పులు జరుపడం కలకలం రేపింది. దుండగులు దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ముగుర్గు యువకులు చోరీ చేసిన వాహనంలో ఘటన స్థలానికి వచ్చి.. స్టూడియో వెలుపల కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ప్రతిగా స్టూడియోలో ఉన్నవారు కూడా కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 16 ఆయుధాలను ఆస్వధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు.
భారత నిఘా ఏజెన్సీల ఆరా..
ఇదిలా ఉంటే.. కెనడాలో ఇండియా సింగర్స్ టార్గెట్‌గా జరిపిన కాల్పుల ఘటనపై భారత ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. ఘటన గురించి ఆరా తీస్తున్నాయి. దుండగులు కాల్పులు జరిపిన ప్రాంతంలో పంజాబీ సింగర్స్ ఇళ్లు ఉన్నాయి. మ్యూజిక్ స్టూడియోలో కూడా పంజాబీలు ఉన్నారు.
వీడియో వైరల్..
ఇదిలా ఉంటే.. కాల్పుల ఘటనకు ముందు పరిస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు పాటలు పాడుతూ కనిపించారు. కొందరు ఆయుధాలతో డ్యాన్స్ చేయడం కనిపిస్తోంది. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగిందని కెనడియన్ మహిళా పోలీస్ అధికారి తెలిపారు. దుండగులు వంద రౌండ్ల కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
గాయకుడి ంటి బయట..
మరోవైపు ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు ఏపీ.థిల్లాన్ ఇంటి బయట కూడా కాల్పులు జరిగాయి. కెనడాడడలోని వాంకోవర్‌లోని అతని ఇంటి వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకు ముందు మరో పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపైనా కాల్పులు జరగడం గమనార్హం.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Indians are targeted in canada singers are shot in front of their houses
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com