Vladimir Putin: ప్రపచం శాస్త్ర సాంకేతికరంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఇక సాంకేతికత అంటేనే ముందుగా గుర్తుకు వచ్చే దేశం జపాన్. ఈ దేశంలో అందరూ పనిచేస్తారు. టెక్నాలజీ వినియోగంలో జపాన్ తర్వాతే ఏ దేశమైనా అన్న గుర్తింపు ఉంది. కానీ, జపాన్‌లో జనాభా క్షిణించడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జనన రేటు తగ్గడంతో దేశంలో వృద్ధులు పెరుగుతున్నారు. ఇక చైనా, రష్యా దేశాల్లో కూడా జనన రేటు బాగా పడిపోయింది. దీంతో ఈ దేశాలు జనాభా పెంచేందుకు యువ జంటల కోసం పథకాలు ప్రవేశపెట్టాయి. అయినా ఆశించిన మేరకు జనాభా పెరగడం లేదు.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగిదే రాబోయే దశాబ్దంలో ఈ దేశాలు వృద్ధ దేశాలుగా మారుతాయన్న ఆందోళన నెలకొంది.
రష్యాలో జనాభా సంక్షోభం..
ఇక రష్యాలో ఇప్పటికే జనన రేటు తగ్గింది. దీనికితోడు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంతో రష్యా సైనికులు మరణిస్తున్నారు. మరోవైపు సైనిక నియామకాలు పెరగడంతో ఆ దేశ యువకులు దేశం వీడివెళ్లిపోతున్నారు. ఫలితంగా రష్యాలో జనాభా శరవేంగా తగ్గుతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఎలాగైనా జనాభా పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందకు నిత్యం పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా జనాభా పెంచే పనిలో ఉండాలని సూచించారు. పుతిన్ సూచనపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. లంచ్, టీ టైంలను కూడా సంతానం పెంచేందకు ఉపయోగించాలని రష్యా ఆరోగ్య మంత్రి కెవగనీ షెస్తోపలోవ్ కూడా సూచించారు. పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సంతానం పెంచే పని మాత్రం మరవొద్దని పేర్కొన్నారు. బేబీలను కనడానికి బ్రేక్ టైంను కూడా వినియోగించుకోవాలని కోరారు.
పడిపోతున్న జనన నిష్పత్తి
ఇదిలా ఉంటే.. రష్యాలో జనన రేటు పడిపోతోంది. ఏ దేశంలో అయిన జనన, మరణ రేటు స్థిరంగా ఉండాలి. కానీ, రష్యాలో మరణన, జనన నిష్పత్తి 2:1గా ఉంది. ఇద్దరు చనిపోతే ఒకరు పుడుతున్నారు. దీంతో జనన రేటు పడిపోతోంది. ఈ ఏడాది జూన్ నాటికి గతంలో ఎన్నడూ లేనంతగా జనన రేటు పడిపోయింది. దీంతో జననాల రేటు పెంచేందుకు పుతిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అబార్షన్, విడాకులను కష్టతరంగా మార్చింది. చెల్యాబినస్క్ ప్రావిన్స్‌లో తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షల రివార్డు ప్రకటించింది.