Devara: దేవర లో మెయిన్ విలన్ సైఫ్ అలీ ఖాన్ కాకుండా మరొకరు ఉన్నారట…చివర్లో ట్విస్ట్ ఇవ్వబోతున్న కొరటాల…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి...

Written By: Gopi, Updated On : September 17, 2024 3:31 pm

Devara(4)

Follow us on

Devara: సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర సినిమా మీద రోజుకోక న్యూస్ వస్తుంది.ఇక ఈ సినిమా మీద వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమా చాలా రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇప్పటికే వరుసగా ఆరు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. హీరోలెవ్వరికి సాధ్యం కానీ రీతిలో మరొక హిట్టు కనక తన ఖాతాలో వేసుకుంటే ఒక భారీ రికార్డును కూడా తను క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దేవర సినిమాతో రికార్డ్ ని క్రియేట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీద జూనియర్ ఎన్టీఆర్ భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి. నిజానికి ఆయన ఈ సినిమాలో విలన్ గా నటించినప్పటికీ మెయిన్ విలన్ మాత్రం ఆయన కాదని కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఆయన కాకుండా విలన్ గా చేస్తున్న నటుడు ఎవరు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటూ దర్శకుడు కొరటాల శివ కూడా చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమా క్లైమాక్స్ లో విలన్ ఎవరు అనేది రివిల్ చేయతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మనకు కనిపించే విలన్ సైఫ్ అలీ ఖాన్ అయితే కనిపించని విలన్ మరొకరు ఉన్నారు అంటూ దేవర సినిమా నుంచి వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటికే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నా కొరటాల శివ కూడా తనదైన రీతిలో ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి దేవర సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది అనేది…