https://oktelugu.com/

Haryana Election: హర్యానాలో అధికారం ఎవరిదో నిర్ణయించేది వారే.. 37 సీట్లలో వారి ప్రభావం.. ప్రసన్నం కోసం పార్టీల యత్నం..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సెప్టెంబర్‌ 16(సోమవారం)తో ముగిసింది. దీంతో బరిలో ఉండేది ఎవరో తేలిపోయింది. దీంతో ప్రచారం ఊపందుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 17, 2024 / 04:05 PM IST

    Haryana Election

    Follow us on

    Haryana Election: హర్యానా అసెబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 5న జరుగనున్నాయి. ఈమేరకు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. ఇక్కడ అధికార బీజేపీ మరోమారు గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తుండగా, లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఈసారి ఇక్కడ ఆప్‌ పార్టీ కీలకంగా మారింది. కాంగ్రెస్, ఆప్‌ పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. దీంతో హర్యానా ఎన్నికల్లో త్రిముఖపోరు ఖాయమన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అధికారం నిలబెట్టుకోవాలనుకున్న బీజేపీకి ఈసారి కాంగ్రెస్, ఆప్‌ పార్టీలు ఇబ్బందికరంగా మారాయి. ముక్కోణపు పోటీలో విజయం తమనే వరిస్తుందని బయటకు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇన్నాళ్లూ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న రైతులు.. అందులో జాట్లు.. ఇపుపడు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

    37 సీట్లలో జాట్ల ప్రభావం..
    హర్యానా ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ ఇండియన్‌ లోక్‌దల్‌(ఐఎన్‌ఎలడ్డీ), జన్‌ నాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) కూడా పలు చోట్ల ప్రభావం చూసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 సీట్లు ఉన్నాయ.ఇ ఇందులో 37 సీట్లలో జాట్ల ప్రభావం ఎక్కువ. జాట్లు కొంతకాలంగా బీజేపీ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌ పథకం, రైతుల ఆందోళనను కేంద్రం అణచివేసిన తీరు, రెజ్లర్లకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహారశైలి తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని, అధికార బీజేపీని ఇబ్బంది పెడతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    జనాభాలో 27 శాతం వారే..
    ఇదిలా ఉంటే.. రాష్ట్ర జనాభాలో 27 శాతం జాట్లు ఉన్నారు. వీరు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను సీఎంగా తప్పించి నాయబ్‌ షైనీని బీజేపీ సీఎంను చేసింది. దీంతో బీజేపీపై జాట్లలో ఉన్న ఆగ్రహం మరింత పెరిగింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెజ్లర్లు వినేశ్‌ఫోగట్‌ను కాంగ్రెస్‌ తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఆమె కాంగ్రెస్‌ విజయంలో కీలకంగా మారారు. ఇలా కాంగ్రెస్‌ గెలుపు ఈసారి ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి ఓటరు మనసులో ఏముందు చూడాలి.