America Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లి చదువుకోవడం ఒకప్పుడు సంపన్నులకే పరిమితమయ్యేది. కానీ, పెరిగిన ఆదాయం, ప్రభుత్వాల సాయం కారణంగా మధ్య తరగతి విద్యార్థులు కూడా డాలర్ డ్రీమ్ చేరువైంది. మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను విదేశాలకు పంపడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు పైసా పైసా కూడబెడుతున్నారు. అప్పులు చేసి మరీ పంపిస్తున్నారు. భారతీయుల్లో అమెరికా క్రేజ్ అంతలా పెరిగింది. అయితే తాజాగ మారిన రాజకీయ పరిస్థితులతో అమెరికా హెచ్–1బీ వీసా ఆశలపై నీళ్లు చల్లింది. ఈమేరు అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తాజాగా కీలక ప్రకటన చేసింది.
లిమిట్ ఓవర్..
2025 సంవత్సరానికి అమెరికా భారతీలకు జారీ చేసే హెచ్–1బీ వీసాల లిమిట్‌కు మించి దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించింది. దీంతో ఇక దరఖాస్తులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రెగ్యులర్ అప్లికెంట్స్ లిమిట్ 65 వేల మార్కును, యూఎస్ అడ్వాన్స్ డిగ్రీ హోల్డర్ల కోసం నిర్దేశించిన 20 వేల వీసాల లమిట్ చేరుకున్నట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో సెలెక్ట్ అయినవారు, కానివారి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేసుకునేవారి ఆశలు ఆవిరయ్యాయి.
ఎవరికి హెచ్–1బీ వీసా..
వాస్తవానికి అమెరికా హెచ్–1బీ వీసాలను తాత్కాలిక ఉద్యోగులు, విద్యార్థులకు జారీ చేస్తుంది. ఈ వీసాల కోసం దరఖాస్తుదారులు డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హత కలిగి ఉండాలి. ముఖ్యంగా ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్, మెడిసిన్, ఎడ్యుకేషన్, బిజినెస్, లా అండ్ ఆర్ట్స్ వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా అర్హత గల ఫీల్డులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్, అమెజాన్, ఇన్‌ఫోసిస్, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీలు 2024లో తక్కువ హెచ్–1బీ వీసాలను స్పాన్సర్ చేశాయి. ఇక అమెరికా 2023లో విదేశీ విద్యార్థుల కోసం 3,86,000 హెచ్–1బీ వీసాలు జారీ చేసింది. వీటిలో భారతీయులే 72 శాతం దక్కించుకున్నారు.
ట్రంప్ గెలుపుతోనే…
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు. 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తమయ్యాయి. అమెరికా వెలుపల ఉన్న విద్యార్థులు జనవరి 20లోపు అమెరికాకు రావాలని సమాచారం ఇస్తున్నాయి. తాజాగా వీసాల లిమిట్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించి నిలిపివేసింది.