Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాశ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు కళానిధి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రుల సాయంతో ఇతరులకు సాయం చేస్తారు. వివాహానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు వస్తాయి. ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి.
వృషభరాశి:
విద్యార్థుల భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని రంగాల వారికి అనుకోకుండా ధన లాభం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
మిథున రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.అదనంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. తల్లిదండ్రుల సాయంతో వ్యాపారులు కొత్త పనిని మొదలుపెడుతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.
కర్కాటక రాశి:
కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తికి సంబంధించిన గొడవలు ఉంటే నేటితో సమసిపోతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.
సింహా రాశి:
ఇతరుల వద్ద అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు రుణం తీసుకోవడానికి ఇది అనువైన సమయం కాదు. జీవిత భాగస్వామితోకలిసి ఉల్లాసంగా ఉంటారు.
కన్యరాశి:
కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలని అనుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. ఇష్టం లేని పనుల జోలికి వెళ్లొద్దు. కొందరు శత్రువులు ఉంటారు. ఆచితూచి వ్యవహరించాలి.
తుల రాశి:
ఈ రాశివారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి. కొందరు శత్రువులు పనులకు ఆటంకం కలిగిస్తారు. ఉద్యోగులు పదోన్నతి లభిస్తుంది. కొన్ని పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి.
వృశ్చిక రాశి:
కొందరు మీ పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. తోటివారి సహకారంతో ఉద్యోగులు కొత్త పనులు ప్రారంభిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. వివాదాలు ఉండే అవకాశం. బంధువులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.
ధనస్సు రాశి:
కుటుంబ సమస్యల పరిష్కారానికి ఇతరుల సాయం తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఉన్నత విద్య కోసం తల్లిదండ్రుల సాయం తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి:
వ్యాపారులు కొత్త పెట్టబడులు పెడుతారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. కొందరు రహస్యంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదంలో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.