Joe Biden : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు వయోభారం, అనారోగ్య సమస్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలుమార్లు విచిత్రంగా ప్రవర్తించారు. ఇటీవలే జీ7 సదస్సుల్లో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ఆయన వివిధ దేశాల అధినేతలంతా ఒకవైపు ఉంటే.. బైడెన్ మాత్రం మరోవైపు ఉండి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు సైగలు చేశాడు. దీనిని గమనించిన ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ బైడెన్‌ను చేయి పట్టుకుని తీసుకొచ్చారు. దీంతో బైడెన్ తేరుకున్నాడు. తాజాగా అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
లాస్ ఏంజిల్స్‌లో శనివారం డెమొక్రాటిక్ పార్టీ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్, ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్ దాదాపు 45 నిమిషాలపాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారుల చప్పట్లతో హాల్ మార్మోగింది. దీంతో ఇద్దరు నేతలు అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు ముందుకు కదిలాడు. బైడెన్ మాత్రం ఎటూ పాలుపోనట్లు పది సెకన్లపాటు అక్కడే స్ట్రక్ అయ్యాడు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైడెన్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన భార్య జిల్ బైడెన్ మాత్రం అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని ఇటీవల ఓ సందర్బంలో వివరణ ఇచ్చారు. 81 ఏళ్ల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
డిసెంబర్‌లో ఎన్నికలు..
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో జరుగనున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ తరఫున బైడెన్ మరోమారు పోటీ చేస్తుండగా రిపబ్లిక్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఒకవైపు ట్రంప్‌ను జైలు శిక్ష భయం వెంటాడుతుండగా, బైడెన్‌ను అనారోగ్యం వెంటాడుతోంది. ఈనేపథ్యంలో అమెరికన్లు ఎన్నికల్లో ఎవరు ఎన్నుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
That’s a wrap on record-setting Democratic fundraiser for Joe Biden’s reelection campaign (netting $28M). Former President Barack Obama and President Joe Biden offer final waves to Peacock Theater crowd as Obama then grabs Biden’s hand to lead him offstage following 40-minute… pic.twitter.com/xbE2jf3jdz
— Chris Gardner (@chrissgardner) June 16, 2024