https://oktelugu.com/

JD Vance: శాకాహారులు భారతీయ ఆహారం తినాలి.. అమెరికా కొత్త ఉపాధ్యక్షుడి పిలుపు వెనక కారణం అదే..

అమెరికా ఉపాధ్యక్షుడిగా.. నూతన అధ్యక్షుడు ట్రంప్‌ రన్నింగ్‌మేట్‌గా జేడీ.వాన్స్‌ 2025, జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. జేడీ.వాన్స్‌ తెలుగువారి అల్లుడే. ఆయన భార్య ఉష ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ.

Written By: Raj Shekar, Updated On : November 11, 2024 3:49 pm

JD Vance

Follow us on

JD Vance: అమెరికా ఎన్నికలు ముగిశాయి. ఇక అధికార మార్పిడి మాత్రమే మిగిలింది. దీంతో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త మంత్రివర్గం, వైట్‌హౌస్‌ కొత్త కార్యవర్గం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రెండ్‌ బుక్‌లో ఉన్నవారిపై చర్యలకు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. మరోవైపు ఆయన రన్నింగ్‌మేట్, కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ.వాన్స్‌ కూడా ఇందులో భాగస్వామి అవుతున్నారు. తాజాగా వాన్స్‌ భారతీయ శాకాహార వంటకాలపై ప్రశంసలు కురిపించారు. తనకు భారతీయ శాకాహార వంటకాలను తన భార్య ఉష రుచి చూపించారని తెలిపారు. తామిద్దరం డేటింగ్‌లో ఉన్నప్పుడు ఉశ తన కోసం వంట చేసేదని తెలిపారు. తన కోసం వండిన మొదటి శాకాహారం గురించి మీడియాకు తెలిపారు. ‘జో రోగన్‌ ఎక్స్‌పీరియన్స్‌’ కార్యక్రమంలో వాన్స్‌ తన ఆహార అభిరుచులు, తన భార్య కారణంగా ఎలా మారాయో వెల్లడించారు. ప్రత్యేకించి ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ.. శాకాహార వంటలవైపు మళ్లామని తెలిపారు. ప్రాసెస్‌ చేసిన మాంసాహారాలపై జో రోగన్‌ చేసిన విమర్వతో ఈ చర్చ ప్రారంభమైంది. ప్రాసెస్‌ చేసిన ఆహారాలను రోగర్‌ చెత్త అని పేర్కొన్నారు. ఇటీవలికాలంలో మొక్కల ఆధారిత ఆహారాలను అలవాటు చేసుకున్న వాన్స్‌ ఈ మాటను అంగీకరించారు.

భారతీయ వంటకాలే తినాలి..
ఇంకా ఎవరైనా శాకాహారిగా మారాలనుకుంటే.. భారతీయ శాకాహారా ఆహారాలను తినాలని రోగన్‌ సలహా ఇచ్చారు. దీనిని జేడీ.వాన్స్‌ కూడా అంగీకరించారు. తన భార్య వంటకాలు, ఆమె నేపథ్యం, ఆమె వంటకాల కారణంగా తన లైఫ్‌ స్టైల్‌ ఎలా మారిందో తెలిపారు. తాను ఉషను కలవడానికి ముందు భారతీయ వంటకాలపై ప్రాథమిక అవగాహన మాత్రమే ఉండేదని తెలిపారు. తన భార్య భారతీయ అమెరికన్‌ అని, ఆమె చేసే శాకాహార వంటలు అద్భుతంగా ఉంటయని వాన్స్‌ తెలిపారు. శాకాహారిగా మారేవారు భారతీయ వంటకాలవైపు మళ్లాలని సూచించారు. నకిలీ మాంసాన్ని తినడం మానేయాలని సూచించారు. ఇక తాను తన ఇంట్లో చేసిన శాకాహార భోజనంతో ఉషను ఆకట్టుకునేందుకు ప్రయత్నించానని తెలిపారు. పిజ్జా రోల్స్‌పై పచ్చి బ్రొకలీని ఉంచి దానిపై మరిన్ని మసాలాలు చల్లి ఓవెన్‌లో 45 నిమిషాలు ఉంచి శాకాహార పిజ్జాను తయారు చేశానని వెల్లడించారు. అయితే అది అత్యంత అసహ్యంగా ఉందని తెలిపారు.

భార్య ఉష కారణంగా..
ఇక తాను శాకాహార భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తనకు కాస్త సమయం పట్టిందని వాన్స్‌ తెలిపారు. తన భార్య ఉష కారణంగానే భారతీయ వంటకాలను రుచి చూశానని, రుచిగా వైవిధ్యంగా ఉంటాయో గ్రహించానని తెలిపారు. భారతీయ ఆహారాన్ని మరేదానితో పోల్చలేమని పేర్కొన్నారు. ఇక ఉష గతంలో తాను తన తల్లి నుంచి శాకాహార వంటకాలు నేర్చుకున్నానని తెలిపారు.