ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది.
Also Read : ట్రంప్ తిరిగి పీఠం దక్కించు కుంటాడా?
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అగ్రరాజ్యం సిద్ధమవుతోంది. నవంబర్ నెల ఒకటో తేదీ నుండి వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) నుంచి అక్కడి ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అమెరికాలో నవంబర్ నెల మూడవ తేదీ నుంచి అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఒకటో తేదీ నుంచే కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమవుతున్నారు.
50 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు మొదట ఎక్కువగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో, 65 సంవత్సరాల వృద్ధులకు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ సైతం కరోనా వ్యాక్సిన్ త్వరగానే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుతుండగా రాజకీయపరమైన కారణాల వల్లే వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read : తెలంగాణలోని ఆ గ్రామంలో 100 మందికి కరోనా… ఎలా సోకిందంటే…?